Stock market: రాణించిన సూచీలు.. 22,300 ఎగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రాణించాయి. సెన్సెక్స్‌ 560 పాయింట్లు, నిఫ్టీ 189 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Updated : 22 Apr 2024 16:08 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన సూచీలూ రాణించాయి. ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులు, ఇన్‌ఫ్రా స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. దీంతో సూచీలు వరుసగా రెండోరోజూ రాణించాయి. సెన్సెక్స్‌ 560 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,300 పాయింట్ల ఎగువన ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 73,666.51 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం అదే ఒరవడిని కొనసాగించింది. ఇంట్రాడేలో 73,227.32 - 73,767.80 మధ్య కదలాడిన సూచీ.. 560.29 పాయింట్లు లాభపడి 73,648.62 వద్ద ముగిసింది. నిఫ్టీ 189.40 పాయింట్లు లాభపడి 22,336.40 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.36గా ఉంది. సెన్సెక్స్‌లో ఎల్అండ్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌‌, విప్రో షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ రకం బ్యారెల్ చమురు ధర 86.74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

వొడాఫోన్ FPO: రూ.18వేల కోట్ల నిధుల సమీకరణలో భాగంగా ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చిన వొడాఫోన్‌ చివరిరోజు 6.92 రెట్లు (సాయంత్రం 3.50 గంటల సమయానికి) సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల నుంచి 19.20 రెట్లు, నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు 4.52 రెట్లు స్పందన లభించింది. రిటైల్‌ పోర్షన్‌ మాత్రం 0.92 శాతమే సబ్‌స్క్రైబ్‌ అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని