Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 89 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Published : 23 Apr 2024 16:15 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన మార్కెట్లూ రాణించాయి. ఉదయం ఓ మోస్తరు లాభాలు నమోదు చేసిన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఉదయం 74,048 పాయింట్ల వద్ద లాభాలలో ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 73,688.31 - 74,059.89 మధ్య కదలాడిన సూచీ.. చివరికి 89.83 పాయింట్ల లాభంతో 73,738.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.60 పాయింట్ల లాభంతో 22,368 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.33గా ఉంది. 

సెన్సెక్స్‌ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, టాటా మోటార్స్‌ షేర్లు ప్రధానంగా రాణించాయి. సన్‌ఫార్మా, రిలయన్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో చాలావరకు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్‌ 87.05 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

  • బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ తన ఎలక్ట్రిక్‌ వాహన విభాగమైన చేతక్‌ టెక్నాలజీ లిమిటెడ్‌కు అబ్రహం జోసెఫ్‌ను మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించింది. 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న జోసెఫ్‌ ప్రస్తుతం చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. పల్సర్‌, ప్లాటినా, సీటీ, బాక్సర్‌, డిస్కవర్‌, వి.అవెంజర్‌, డామినర్‌ వంటి పాపులర్‌ బ్రాండ్లు ఆయన నేతృత్వంలోనే రూపుదిద్దుకున్నాయి. ఇకపై చేతక్‌ ఈవీ బాధ్యతలను చూడనున్నారు. రామ్‌తిలక్‌ అనంతన్‌ బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ సీటీఓగా వ్యవహరిస్తారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని