Stock market: సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్‌.. కారణమేంటి?

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి.

Updated : 28 Mar 2024 15:03 IST

Stock market | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు; బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్ స్టాక్స్‌ రాణించడంతో సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 1.10 గంటలకు సెన్సెక్స్‌ 900కి పైగా పాయింట్ల లాభంతో 73,902 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 284 పాయింట్ల లాభంతో 22,412 ఎగువన కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఒక్క యాక్సిస్‌ బ్యాంక్‌ మినహా మిగిలిన అన్ని షేర్లూ లాభాల్లో కొనసాగుతుండడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరి ట్రేడింగ్‌ సెషన్‌ కూడా కావడం గమనార్హం.

లాభాల పరుగుకు కారణాలివే..

  • నిన్నటి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ 1.22 శాతం, ఎస్‌అండ్‌పీ 500.. 0.86 శాతం, నాస్‌డాక్‌ 0.51 శాతం చొప్పున లాభపడ్డాయి. దీనికితోడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. చైనా, హాంకాంగ్‌, ఆస్ట్రేలియా మార్కెట్లూ భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లూ సూచీల పరుగుకు కారణమయ్యాయి. ఆల్టర్‌నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టిన బ్యాంకులు/ ఆర్థిక సంస్థలు అధిక మొత్తంలో ప్రొవిజన్లు పక్కన పెట్టాలని డిసెంబర్‌లో ఆర్‌బీఐ నిబంధనలు తీసుకొచ్చింది. తాజాగా ఆ నిబంధనలను సవరించడం పాజిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమైంది. దీంతో ఐసీఐసీఐ, ఎస్‌బీఐతో పాటు బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌లు రాణిస్తున్నాయి.
  • విదేశీ పోర్టిఫోలియో ఇన్వెస్టర్ల కొనుగోళ్లూ సూచీలకు కలిసొచ్చాయి. బుధవారం రూ.2,170 కోట్ల విలువైన షేర్లను వీరు కొనుగోలు చేసినట్లు డేటా చెబుతోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని