Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. రూ.5 లక్షల కోట్లు ఆవిరి!

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 845 పాయింట్లు, నిఫ్టీ 246 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

Published : 15 Apr 2024 16:14 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు సూచీలను పడేశాయి. ఇరాన్‌ జరిపిన దాడులకు ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులకు తెగబడొచ్చన్న అంచనాలు మదుపరులను కలవరపెట్టాయి. దీంతో మన సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 800కు పైగా పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 22,300 దిగువకు చేరింది. మదుపరుల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.5 లక్షల కోట్లు క్షీణించి రూ.394 లక్షల కోట్లకు చేరింది.

సెన్సెక్స్‌ ఉదయం 73,315.16 పాయింట్ల వద్ద దాదాపు 900 పాయింట్ల భారీ నష్టంతో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 73,905 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకినప్పటికీ.. దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. చివరికి 845.12 పాయింట్ల నష్టంతో 73,399.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 246.90 పాయింట్ల నష్టంతో 22,272.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.45గా ఉంది. సెన్సెక్స్‌లో మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌ మినహా అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌ ప్రధానంగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో 27, నిఫ్టీ-50లో 44 స్టాక్స్‌ నష్టపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని