Stock market: సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో సాయంత్రానికి నష్టాల్లోకి జారుకున్నాయి.

Published : 18 Apr 2024 16:05 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో సాయంత్రానికి నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా వడ్డీ రేట్ల కోతపై ఆశలు క్షీణించడం, మధ్యప్రాశ్చంలో ఘర్షణ వాతావరణం వంటి కారణాలు సూచీలను పడేశాయి.

ఉదయం సెన్సెక్స్‌ 73,183.10 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఉదయం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 73,473.05 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో ఒక్కసారిగా పతనమైంది. ఇంట్రాడేలో గరిష్ఠాల నుంచి దాదాపు వెయ్యి పాయింట్ల మేర క్షీణించింది. చివరికి 454.69 పాయింట్ల నష్టంతో 72,488.99 వద్ద ముగిసింది. నిఫ్టీ 152.05 పాయింట్ల నష్టంతో 21,995 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.55గా ఉంది.

సెన్సెక్స్‌లో నెస్లే ఇండియా, టైటాన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, టాటా మోటార్స్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ రకం బ్యారెల్‌ ధర 86.34 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు