RBI Report: ₹2 వేలు నోట్ల ఉపసంహరణతో ₹500 నోటే కింగ్‌

రూ.2వేల నోట్ల ఉపసంహరణతో రూ.500 నోటుకు ఆదరణ పెరిగింది. చలామణీలో ఉన్న వీటి వాటా పెరిగింది.

Published : 31 May 2024 00:20 IST

RBI Report | ముంబయి: దేశంలో రూ.500 నోట్లకు ఎనలేని డిమాండ్‌ ఏర్పడింది. రూ.2 వేల నోట్లను ఆర్‌బీఐ (RBI) ఉపసంహరించుకోవడంతో వీటి వినియోగం గణనీయంగా పెరిగింది. 2024 మార్చి నాటికి చలామణీలో ఉన్న మొత్తం నగదులో 86.5 శాతం వీటిదే కావడం గమనార్హం. అంతకు ముందు ఏడాది వీటి వినియోగం 77.1 శాతంగా ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన వార్షిక నివేదికలో తెలిపింది.

గతేడాది మే నెలలో రూ.2 వేల నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో వీటి వాటా 10.8 శాతం నుంచి తాజాగా 0.2 శాతానికి దిగి వచ్చింది. దీంతో ఒక్కసారిగా రూ.500 నోటుకు డిమాండ్‌ ఏర్పడింది. సుమారు ఈ నోట్లు 5.16 లక్షల నోట్లు చలామణీలో ఉన్నాయి. దీని తర్వాత పది రూపాయాల విలువైన నోట్లు 2.49 లక్షల నోట్లు చలామణీలో ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది. రూ.2 వేల నోట్ల ఉపసంహరణతో నకిలీ నోట్ల బెడద కూడా తగ్గిందని ఆర్‌బీఐ తెలిపింది.

రూ.27వేల కోట్ల గోల్డ్‌ బాండ్లు

సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. మార్చితో గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.27,031 కోట్ల విలువైన గోల్డు బాండ్లను కొనుగోలు చేసినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. 2022-23తో పోలిస్తే ఈ మొత్తం నాలుగు రెట్లు అధికం. గోల్డ్‌ బాండ్ల మంచి ప్రతిఫలం వస్తుండడం, పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తుండడంతో ప్రజలు వీటిలో పెట్టుబడికి ఆసక్తి చూపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని