Twitter: త్వరలో 10,000 క్యారెక్టర్లతో ట్వీట్లు.. వారికి మాత్రమే!

Twitter: త్వరలో ట్విటర్‌లో సుదీర్ఘ నిడివి గల ట్వీట్లను ప్రారంభించనున్నట్లు సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. 

Published : 22 Mar 2023 01:10 IST

వాషింగ్టన్‌: ట్విటర్‌ (Twitter)లో మరో కీలక మార్పును త్వరలోనే చేపట్టనున్నట్లు సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. ట్వీట్ల నిడివిని 10,000 క్యారక్టర్లకు పెంచనున్నట్లు వెల్లడించారు. దీనికి సులభమైన ఫార్మాట్‌ టూల్స్‌ను కూడా జత చేయనున్నట్లు చెప్పారు. సుదీర్ఘ నిడివి గల ట్వీట్లను తీసుకురావాలనే ఆలోచన అద్భుతమంటూ ఓ యూజర్‌ చేసిన ట్వీట్‌కు బదులిస్తూ మస్క్‌ ఈ విషయాలు వెల్లడించారు.

అలాగే ప్రీమియం కంటెంట్‌ కోసం సబ్‌స్క్రిప్షన్‌ ఫీజును వసూలు చేసే ప్రక్రియను సైతం రైటర్లకు సులభతరం చేయనున్నట్లు మస్క్‌ (Musk) తెలిపారు. ట్విటర్‌ బ్లూ (Twitter Blue) సబ్‌స్క్రైబర్లకు ప్రస్తుతం అమెరికాలో 4,000 క్యారెక్టర్లతో ట్వీట్‌ చేసే అవకాశం ఉంది. ఇది కేవలం బ్లూ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే. నాన్‌-సబ్‌స్క్రైబర్లకు మాత్రం ఇంకా 280 క్యారెక్టర్ల పరిమితి కొనసాగుతోంది. అయితే వీరు బ్లూ సబ్‌స్క్రైబర్లు చేసే సుదీర్ఘ ట్వీట్లను చదవడం, రిప్లై, రీట్వీట్‌, కోట్‌ చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు