Stock Market: ఏడు రోజుల ర్యాలీకి బ్రేక్‌.. నిఫ్టీ @ 20,900

Stock Market Closing bell: సెన్సెక్స్‌ 132.04 పాయింట్ల నష్టంతో 69,521.69 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 36.55 పాయింట్ల నష్టంతో 20,901.15 వద్ద ముగిసింది.

Published : 07 Dec 2023 16:04 IST

Stock Market Closing bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. దీంతో ఏడు రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. రోజంతా సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. గతకొన్ని రోజుల భారీ లాభాల నేపథ్యంలో కీలక స్టాక్స్‌లో కొంత లాభాల స్వీకరణ కనిపించింది. మరోవైపు శుక్రవారం ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.

ఉదయం సెన్సెక్స్‌ 69,694.15 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 69,320.53 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 132.04 పాయింట్ల నష్టంతో 69,521.69 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 20,932.40 దగ్గర ప్రారంభమై, చివరకు 36.55 పాయింట్లు నష్టపోయి 20,901.15 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 20,850.80 దగ్గర కనిష్ఠానికి చేరింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.36 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌-30 సూచీలో 12 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టైటన్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, మారుతీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, టాటా స్టీల్‌, ఐటీసీ, ఎల్అండ్‌టీ, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని