Stock Market: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,437

Stock Market Opening bell: ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 145 పాయింట్లు నష్టపోయి 73,868 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు కుంగి 22,437 దగ్గర కొనసాగుతోంది.

Published : 02 Apr 2024 09:30 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 145 పాయింట్లు నష్టపోయి 73,868 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు కుంగి 22,437 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.37 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లే ఇండియా, టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, ఎల్‌ అండ్‌ టీ, టైటన్‌, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, విప్రో, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) సోమవారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 87.83 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ సోమవారం నికరంగా రూ.522.30 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.1,208.42  కోట్ల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.

దేశీయంగా ప్రయాణికుల వాహన (కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్లు) టోకు సరఫరాలు గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రికార్డు గరిష్ఠమైన 42.3 లక్షలకు చేరాయి. విద్యుత్తు వాహన (Electric Vehicles) అమ్మకాలు కూడా దుమ్ము రేపాయి. అన్ని విభాగాల వాహనాలు కలిసి 16.6 లక్షల మేరకు అమ్ముడయ్యాయి. మార్చిలో జీఎస్‌టీ వసూళ్లు ఏడాది క్రితంతో పోలిస్తే 11.5% పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని