Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,215

Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 59 పాయింట్లు లాభపడి 73,116 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 22,215 దగ్గర కొనసాగుతోంది.

Published : 21 Feb 2024 09:39 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నాయి. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 59 పాయింట్లు లాభపడి 73,116 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 22,215 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.91 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎం అండ్‌ ఎం, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌, టైటన్‌, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) మంగళవారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా పసిఫిక్‌ ప్రధాన సూచీలు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 82.65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ మంగళవారం నికరంగా రూ.1,335.51 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.1,491.33 కోట్ల  వాటాలను కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని