Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Opening bell | ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 195 పాయింట్ల లాభంతో 69,716 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 20,967 దగ్గర ట్రేడవుతోంది.

Published : 08 Dec 2023 09:36 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 195 పాయింట్ల లాభంతో 69,716 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 20,967 దగ్గర ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.33 దగ్గర ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, మారుతీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గురువారం లాభాల్లో ముగిశాయి. ఆల్ఫాబెట్‌, ఏఎండీ సహా లార్జ్‌క్యాప్‌ స్టాక్స్ రాణించడం అక్కడి సూచీలకు కలిసొచ్చింది. ఆసియా మార్కెట్లు నేడు ఆరంభ ట్రేడింగ్‌లో మిశ్రమంగా కదలాడుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం రూ.1,564 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) సైతం రూ.9.66 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మారు.

మరికాసేపట్లో ఆర్‌బీఐ (RBI) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడనున్నాయి. కీలక రేట్లను యథాతథంగా ఉంచుతారనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, వృద్ధి రేటు, ద్రవ్యోల్బణ అంచనాలు సహా ఆర్థిక వ్యవస్థపై ఆర్‌బీఐ చేయబోయే వ్యాఖ్యలను మదుపర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు