Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 22,100 ఎగువన నిఫ్టీ

Stock Market Opening bell: ఉదయం 9:36 గంటల సమయంలో సెన్సెక్స్‌ 421 పాయింట్ల లాభంతో 72,922 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 146 పాయింట్లు పుంజుకొని 22,128 దగ్గర కొనసాగుతోంది.

Published : 01 Mar 2024 09:45 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:36 గంటల సమయంలో సెన్సెక్స్‌ 421 పాయింట్ల లాభంతో 72,922 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 146 పాయింట్లు పుంజుకొని 22,128 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.86 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో టాటా స్టీల్‌, ఎం అండ్‌ ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, మారుతీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, పవర్‌గ్రిడ్‌, విప్రో, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్‌, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో భారత జీడీపీ 8.4% వృద్ధి చెందింది. మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరు మధ్య 13% తగ్గి 32 బి.డాలర్ల (సుమారు రూ.2,65,000 కోట్ల)కు పరిమితమైనట్లు ప్రభుత్వ తాజా గణాంకాలు వెల్లడించాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గురువారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలూ సానుకూలంగా ఉన్నాయి. జపాన్‌, ఆస్ట్రేలియా మార్కెట్లు రికార్డు గరిష్ఠాల వద్ద ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 83.62 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ గురువారం నికరంగా రూ.3,568.11 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.230.21 కోట్ల స్టాక్స్‌ను విక్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు