ప్రత్యేక ట్రేడింగ్‌లో స్వల్ప లాభాలు

విదేశీ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రాథమిక సైట్‌లో వైఫల్యం తలెత్తినా ఎదుర్కొనేందుకు వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ను శనివారం రెండు దఫాలుగా నిర్వహించాయి.

Updated : 19 May 2024 02:42 IST

విదేశీ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రాథమిక సైట్‌లో వైఫల్యం తలెత్తినా ఎదుర్కొనేందుకు వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ను శనివారం రెండు దఫాలుగా నిర్వహించాయి. ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు ప్రాథమిక సైట్‌ (పీఆర్‌)లో,    11:30 నుంచి 12:30 గంటల వరకు డిజాస్టర్‌ రికవరీ (డీఆర్‌) సైట్‌లో ట్రేడింగ్‌ జరిగింది. సెన్సెక్స్‌ 88.91 పాయింట్ల లాభంతో 74,005.94 వద్ద ముగిసింది. నిఫ్టీ 35.90 పాయింట్లు పెరిగి చివరకు 22,502 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ   జీవన కాల  గరిష్ఠమైన రూ.4,12,36,791.05 కోట్లకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని