Stock Market: స్టాక్‌ మార్కెట్లలో కొనసాగిన లాభాలు

Stock Market Closing bell: శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 250 పాయింట్లు పైగా లాభపడగా.. నిఫ్టీ 22,450 మార్క్‌ పైన స్థిరపడింది.

Published : 17 May 2024 16:09 IST

Stock Market Closing bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీ (Stock Market)లు ఆ తర్వాత కీలక రంగాల్లో మదుపర్ల కొనుగోళ్ల అండతో కోలుకున్నాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ (Sensex) 250 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ (Nifty) 22,450 మార్క్‌ పైన స్థిరపడింది.

క్రితం సెషన్‌లో 600 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్‌.. ఈ ఉదయం 73,711.31 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. తొలి సెషన్‌లో ఒడుదొడుకులను ఎదుర్కొన్న సూచీ.. ఆ వెంటనే పుంజుకుని ఇంట్రాడేలో 74వేల మార్క్‌ను దాటి ట్రేడ్‌ అయ్యింది. చివరకు 253.31 పాయింట్ల లాభంతో 73,917.03 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 22,345-22,502 పాయింట్ల మధ్య ఊగిసలాడి మార్కెట్‌ ముగిసేసరికి 62.25 పాయింట్ల లాభంతో 22,466.10 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు పెరిగి 83.34గా ఉంది.

నిఫ్టీలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, గ్రాసిమ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, భారత్‌ పెట్రోలియం షేర్లు రాణించగా.. టీసీఎస్‌, సిప్లా, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు