Sundar Pichai: ‘అది కఠిన నిర్ణయం’.. లేఆఫ్‌లపై సుందర్‌ పిచాయ్‌!

Sundar Pichai: ఈ ఏడాదిలో ఏకంగా 12,000 వేల మందిని ఉద్యోగం నుంచి తొలగించటంపై గూగుల్‌ సంస్థ సీఈఓ స్పందించారు. తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

Updated : 16 Dec 2023 16:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మాంద్యం భయాల నేపథ్యంలో పెద్ద పెద్ద కంపెనీలు ఈ ఏడాదిలో పెద్దఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయిన గూగుల్‌ (Google) మాతృ సంస్థ అల్ఫాబెట్‌ సైతం ఏకంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. అయితే తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో లేఆఫ్‌లపై అడిగిన ప్రశ్నకు సంస్థ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) స్పందించారు. కంపెనీ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

‘శ్రామిక శక్తిని తగ్గించడానికి లేఆఫ్‌ లాంటి కఠినమైన నిర్ణయం తీసుకొని దాదాపు సంవత్సరం కానుంది. ఈ నిర్ణయంతో కంపెనీ వృద్ధి, లాభ, నష్టాలపై ఎలాంటి ప్రభావం చూపిందని భావిస్తున్నారు’ అని మంగళవారం నిర్వహించిన సమావేశంలో పిచాయ్‌ని ఓ ఉద్యోగి ప్రశ్నించారు. దీనికి పిచాయ్‌ బదులిస్తూ.. గత 25 సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితిని తాను చూడలేదన్నారు. ఆర్థిక ఇబ్బందుల్ని, భవిష్యత్ వృద్ధిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ లేఆఫ్‌ దిశగా అడుగులు వేసిందని పేర్కొన్నారు.

IANS న్యూస్‌ ఏజెన్సీలో అదానీకి మెజారిటీ వాటా

‘ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఏ కంపెనీకైనా కష్టం. గత 25 ఏళ్లలో మేం ఇలాంటి సందర్భాన్ని చూడలేదు. ఆ సమయానికి లేఆఫ్‌ నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితులు మరింత కష్టంగా మారేవి. అయినా ఉద్యోగులను తొలగించడం చాలా కఠినమైన నిర్ణయం’’ అని పిచాయ్‌ అన్నారు. ఉద్యోగులను ఇలా తొలగించడం సరైన పద్ధతి కాదు, దీన్ని కొంచెం భిన్నంగా చేయాల్సి ఉందని తాను భావించానని పిచాయ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని