Gautam adani: IANS న్యూస్‌ ఏజెన్సీలో అదానీకి మెజారిటీ వాటా

Gautam adani: అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ మీడియా రంగంలో మరో కొనుగోలు జరిపారు. న్యూస్‌ ఏజెన్సీ IANSలో మెజారిటీ వాటాను ఆయన సొంతం చేసుకున్నారు.

Published : 16 Dec 2023 13:29 IST

Gautam adani- IANS | దిల్లీ: ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ (Gautam adani) తన మీడియా వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నారు. తాజాగా న్యూస్‌ ఏజెన్సీ ఐఏఎన్‌ఎస్‌  (IANS) ప్రైవేట్‌ లిమిటెడ్‌లో వాటాలను కొనుగోలు చేశారు. ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందీ వెల్లడించలేదు. అదానీ గ్రూప్‌నకు చెందిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌ ద్వారా 50.50 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఈ మేరకు అదానీ గ్రూప్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

18 నుంచి గోల్డ్‌ బాండ్‌ సబ్‌స్క్రిప్షన్‌.. గ్రాము ధరెంత? ఎలా కొనాలి?

గతేడాది మార్చిలో బిజినెస్‌, ఫైనాన్షియల్‌ న్యూస్‌ అందించే క్వింటిలియన్‌ బిజినెస్‌ మీడియా కొనుగోలుతో మీడియా రంగంలోకి అడుగుపెట్టిన అదానీ.. అదే ఏడాది డిసెంబర్‌లో ఎన్డీటీవీలో (NDTV) 65 శాతం వాటాను చేజిక్కించుకున్నారు. తాజాగా ఐఏఎన్‌ఎస్‌ న్యూస్‌ ఏజెన్సీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐఏఎన్‌ఎస్‌ ఆదాయం రూ.11.86 కోట్లుగా ఉంది. తాజా కొనుగోలు ద్వారా ఐఏఎన్‌ఎస్‌ కార్యకలాపాలు, మేనేజ్‌మెంట్‌ వ్యవహారాలను ఇకపై ఏఎంఎన్‌ఎల్‌ చూడనుంది. అలాగే ఐఏఎన్‌ఎస్‌తో డైరెక్టర్లను నియమించే హక్కులు దఖలు పడినట్లు ఆ కంపెనీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని