Power: 104 MW విండ్‌ ప్రాజెక్ట్‌ ఆర్డర్‌ పొందిన సుజ్లాన్‌

సుజ్లాన్‌..AMPIN ఎనర్జీ నుంచి 103.95 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ఆర్డర్‌ను పొందింది.

Published : 11 Jun 2024 19:39 IST

దిల్లీ: ప్రముఖ పునరుత్పాదక ఇంధన సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌.. సుజ్లాన్‌ గ్రూప్‌ మంగళవారం AMPIN ఎనర్జీ ట్రాన్సిషన్‌ నుంచి 103.95 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను పొందినట్లు తెలిపింది. ఒప్పందంలో భాగంగా రాజస్థాన్‌లోని ఫతేఘర్‌ జిల్లాలో సుజ్లాన్‌..విండ్‌ టర్బైన్స్‌ను సరఫరా చేసి ప్రాజెక్ట్‌ సమగ్ర కార్యకలాపాలతో పాటు, నిర్వహణ సేవలను కూడా చేపడుతుందని సుజ్లాన్‌ ఇండియా సీఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. సుజ్లాన్‌ 33 విండ్‌ టర్బైన్‌ జనరేటర్లను హైబ్రిడ్‌ లాటిస్‌ ట్యూబ్యులర్‌(HLT) టవర్‌తో, ఒక్కోటి 3.15 మెగావాట్ల రేట్‌ సామర్థ్యంతో అమర్చుతుంది. ఈ పరిమాణంలో ఉన్న ఒక ప్రాజెక్ట్‌ 85 వేల ఇళ్లకు విద్యుత్తును అందించడమే కాకుండా, సంవత్సరానికి 3.38 లక్షల టన్నుల CO2 ఉద్గారాలను అరికట్టగలదు. ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని