Tata Motors: అదరగొట్టిన టాటా మోటార్స్‌.. లాభంలో 133.32% వృద్ధి

Tata Motors Q3 profits: టాటా మోటార్స్‌, ఇండిగో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. రెండు సంస్థలు రెట్టింపు లాభాలను ఆర్జించాయి.

Published : 02 Feb 2024 20:35 IST

Tata Motors Q3 profits | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ (Tata Motors) త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.7,100 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,043 కోట్లతో పోలిస్తే 133.32 శాతం వృద్ధి నమోదైంది.

టాటా మోటార్స్‌ ఏకీకృత ఆదాయం 25శాతం పెరిగి రూ.1,10,600 కోట్లకు చేరినట్లు తెలిపింది. ‘‘మూడో త్రైమాసికంలో లాభాలు ఆర్జించటం ఆనందంగా ఉంది. రానున్న త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు నమోదు చేస్తాం’’ అని టాటా మోటార్స్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పి.బి.బాలాజీ ఆశాభావం వ్యక్తం చేశారు.

రూ.29కే కిలో బియ్యం.. వచ్చే వారం నుంచి ‘భారత్‌ రైస్‌’ విక్రయాలు

ఇండిగో లాభం డబుల్‌..  

ఇండిగో (IndiGo) బ్రాండ్‌పై విమానాలను నడుపుతున్న ఇంటర్‌గ్లోబల్‌ ఏవియేషన్‌ డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.2,998.1 కోట్ల నికర లాభాన్ని (పన్నుల అనంతరం) నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నికర లాభం రూ.1,422.6 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.15,410.2 కోట్ల నుంచి రూ.20,062.3కు పెరిగింది. టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం 30.3 శాతం పెరిగి రూ.1,71,572 మిలియన్లకు చేరింది. అనుబంధ ఆదాయం 23.8 శాతం పెరిగి రూ.17,600 మిలియన్లుగా నమోదైంది. ‘5 వరుస త్రైమాసికాల లాభాలతో కొవిడ్‌ సమయంలో నమోదైన నష్టాల నుంచి సంస్థను లాభాల వైపు నడిపించగలిగాం’ అని ఇండిగో సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని