హెచ్‌డీఎఫ్‌ బ్యాంక్‌తో టాటా మోటార్స్‌ ఒప్పందం

టాటా మోటార్స్‌, వాణిజ్య వాహనాల ఫైనాన్సింగ్‌ కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది.

Published : 07 Dec 2023 18:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాటా మోటార్స్‌ తన వాణిజ్య వాహన వినియోగదారుల కోసం డిజిటల్‌ ఫైనాన్సింగ్‌ సొల్యూషన్స్‌ను అందించడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు గురువారం తెలిపింది. ఈ మేరకు రెండు సంస్థలు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయని టాటా మోటార్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ భాగస్వామ్యం కింద టాటా మోటార్స్‌ కస్టమర్స్‌ ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెహికల్‌ ఫైనాన్సింగ్‌ సొల్యూషన్స్‌ను.. టాటా మోటార్స్‌ ఆన్‌లైన్‌ సేల్స్‌ ప్లాట్‌ఫాం, టాటా ఇ-గురు మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా సులువుగా యాక్సెస్‌ చేయొచ్చు. బస్సులు, ట్రక్కులు, చిన్న వాణిజ్య వాహనాలతో సహా టాటా మోటార్స్‌ అందించే అన్ని వాణిజ్య వాహనాలకు ఫైనాన్స్‌ సదుపాయం ఉంటుందని టాటా మోటార్స్‌ ప్రతినిధి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని