Tata Motors: మారుతీని దాటేసిన టాటా మోటార్స్‌

Tata Motors: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ సంస్థగా అవతరించింది.

Published : 30 Jan 2024 21:11 IST

దిల్లీ: భారత వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్‌ (Tata Motors) సరికొత్త ఘనత సాధించింది. మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే అతి పెద్ద ఆటోమొబైల్‌ కంపెనీగా అవతరించింది. డీవీఆర్‌ షేర్లు, కంపెనీ మార్కెట్ విలువ పరంగా మారుతీ సుజుకీ (Maruti Suzuki)ని అధిగమించింది. టాటా మోటార్స్‌ విలువ రూ.2,85,515.64 కోట్లు, టాటా మోటార్స్‌ లిమిటెడ్ డీవీఆర్‌ విలువ రూ.29,119.42 కోట్లతో కలిపి మొత్తం రూ.3,14,635.06 కోట్ల మార్కెట్‌ విలువతో ఆటోమొబైల్ కంపెనీల్లో మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రూ.3,13,058.50 కోట్లతో మారుతీ సుజుకీ రెండో స్థానానికి పరిమితమైంది. 

మార్కెట్‌ ముగిసే సమయానికి టాటా మోటార్స్‌ షేరు 2.19 శాతం పెరిగి రూ.859.25 వద్ద స్థిరపడింది. టాటా మోటార్స్‌ లిమిటెడ్ డీవీఆర్‌ షేర్లు 1.63శాతం పెరిగి రూ. 572.65కు చేరాయి. ఇంట్రాడేలో రూ.886.30 వద్ద 52 వారాల గరిష్ఠానికి చేరాయి. అదే సమయంలో మారుతీ సుజుకీ షేర్లు 0.36 శాతం నష్టంతో రూ.9,957.25 వద్ద ముగిశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని