Tata Motors: జనవరిలో టాటా మోటార్స్‌ అమ్మకాల్లో గణనీయ వృద్ధి

టాటా మోటార్స్‌..దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో కలిపి 6% అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది.

Published : 01 Feb 2024 18:13 IST

దిల్లీ: టాటా మోటార్స్‌ 2024 జనవరిలో తమ మొత్తం వాహన విక్రయాలు (అంతర్జాతీయ మార్కెట్లతో కలిపి) 6% వృద్ధితో 84,276 యూనిట్లకు చేరుకున్నట్లు సంస్థ గురువారం వెల్లడించింది. గతేడాది (2023) జనవరిలో కంపెనీ మొత్తం 79,681 వాహనాలను విక్రయించినట్లు తెలిపింది. గతేడాది మొత్తం వాణిజ్య వాహనాలు 32,780 విక్రయిస్తే, ఈ ఏడాది జనవరిలో (2% క్షీణతతో) 32,092 యూనిట్లు విక్రయించింది. ఎలక్ట్రిక్‌ వాహనాలతో సహా మొత్తం దేశీయ ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు 12% వృద్ధితో 54,033 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఈ విక్రయాలు 48,289 మాత్రమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని