TCS AI skills: టీసీఎస్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్‌ ఏఐలో శిక్షణ

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్‌.. తన కంపెనీలో పని చేస్తున్న సగానికి పైగా ఉద్యోగులకు ఏఐలో శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించింది. 

Published : 29 Mar 2024 18:05 IST

ముంబయి: ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌కు (AI) డిమాండ్‌ పెరుగుతున్న వేళ తద్వారా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఐటీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇందులోభాగంగా తమ ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నాయి. ఈవిషయంలో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ (TCS) ముందు వరుసలో నిలుస్తోంది. ఇప్పటివరకు జనరేటివ్‌ ఏఐ స్కిల్స్‌లో 3.5 లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు ఆ కంపెనీ వెల్లడించింది.

ఈ ఏడాది జనవరిలో 1.5 లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు టీసీఎస్‌ తొలుత వెల్లడించింది. ఆ తర్వాత మరికొందరికి ట్రైనింగ్‌ ఇచ్చింది. అలా ఇప్పటివరకు 3.5 లక్షల మందికి జనరేటివ్‌ ఏఐ విభాగంలో ప్రాథమిక నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. దీంతో సంస్థలో పనిచేస్తున్న వారిలో సగానికి పైగా ఉద్యోగులను ఏఐకు సన్నద్ధం చేసినట్లయింది. ఏఐ విషయంలో టీసీఎస్‌ ఎప్పుడూ ముందువరుసలోనే ఉంటూ వస్తోంది. క్లౌడ్‌, ఏఐ విషయంలో కస్టమర్‌ అవసరాలకు అనుగుణంగా ఆయా విభాగాల కోసం ప్రత్యేక బిజినెస్‌ యూనిట్‌ను తొలుత ఏర్పాటుచేసింది కూడా టీసీఎస్సే. తాజాగా అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ నుంచి జనరేటివ్‌ ఏఐ కాంపిటెన్సీ పార్ట్‌నర్‌ స్టేటస్‌ అందుకున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని