Tesla showroom: భారత్‌లో టెస్లా రెండో షోరూమ్‌.. వీ4 సూపర్‌ఛార్జర్ల ఏర్పాటు

Eenadu icon
By Business News Team Published : 11 Aug 2025 16:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Tesla showroom | దిల్లీ: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌లో మరో షోరూమ్‌ తెరిచింది. దేశ రాజధాని దిల్లీలోని ఏరోసిటీ, వరల్డ్‌మార్క్‌ 2లో తన రెండో షోరూమ్‌ను సోమవారం ప్రారంభించింది. సుమారు 8,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త షోరూమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ షోరూమ్‌కు సమీపంలోనే విమానాశ్రయం, రాయబార కార్యాలయాలు, కార్పొరేట్ ఆఫీసులు ఉండడంతో ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ కావొచ్చని కంపెనీ భావిస్తోంది.

వినియోగదారులకు అనుకూలమైన ప్రదేశంలో ఉండడం వల్ల టెస్లా బేస్‌మెంట్‌ పార్కింగ్‌లో నాలుగు వీ4 సూపర్‌ఛార్జర్లు ఏర్పాటు చేసింది. సాకేత్, నోయిడా, ఆరిజన్‌ తదితర ప్రాంతాల్లో ఈ సూపర్‌ఛార్జర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ముంబయిలో తొలి షోరూమ్‌ను ఓపెన్‌ చేసిన టెస్లా.. కొన్ని రోజుల క్రితమే మొదటి సూపర్‌ ఛార్జర్‌ స్టేషన్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌, పుణె, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌, జైపుర్ వంటి ఎనిమిది నగరాల్లోనూ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది.

వీ4 సూపర్‌ఛార్జర్‌ అనేది డీసీ ఛార్జింగ్‌ సదుపాయంతో వస్తుంది. ఇక్కడ కారుకు ఛార్జింగ్‌ చేయడానికి కిలోవాట్‌కు రూ.24 వసూలు చేస్తారు. 11kWh స్పీడ్ ఉన్న ఏసీ ఛార్జింగ్‌కు కిలోవాట్‌ ధర రూ.11గా నిర్ణయించారు. ఈ వీ4 సూపర్‌ ఛార్జర్‌ ద్వారా కొత్తగా లాంచ్‌ చేసిన టెస్లా మోడల్‌ వై కారును కేవలం 15 నిమిషాల పాటు ఛార్జ్‌ చేసి 267 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. దేశీయ మార్కెట్‌లో మోడల్‌ Y కారు రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.59.89 లక్షలు, లాంగ్‌ రేంజ్‌ మోడల్‌ ధర రూ.67.89 లక్షలుగా కంపెనీ తెలిపింది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 500-600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు