లక్షకు పైగా టెస్లా కార్ల రీకాల్‌.. కారణం ఇదే..

Tesla: కార్ల తయారీ సంస్థ టెస్లా లక్షకు పైగా కార్లను రీకాల్‌ చేపట్టింది. సీట్‌ బెల్ట్‌ వార్నింగ్ సిస్టమ్‌ పనితీరులో తలెత్తిన లోపం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 01 Jun 2024 00:13 IST

Tesla | ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్‌ కార్ల (EV) తయారీ సంస్థ టెస్లా (Tesla) పెద్దఎత్తున కార్లను రీకాల్ చేపట్టింది. సీట్‌ బెల్ట్‌ వార్నింగ్‌ సిస్టమ్‌ పనితీరులో లోపాలు తలెత్తిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 1,25,000లకు పైగా వాహనాలను వెనక్కి రప్పిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

2012-2024 మధ్య తీసుకొచ్చిన ఎస్‌ మోడల్‌, 2015-2024 మధ్య లాంచ్‌ చేసిన ఎక్స్‌ మోడల్‌, 2017-2023 తీసుకొచ్చిన మోడల్‌ 3, 2020-2023 మధ్య వచ్చిన వై మోడళ్లను రీకాల్‌ చేస్తున్నట్లు టెస్లా పేర్కొంది. సాఫ్ట్‌వేర్‌లో సమస్య కారణంగా వీటిని వెనక్కి రప్పిస్తున్నట్లు తెలిపింది. సాధారణంగా సీటు బెల్టు ధరించని డ్రైవర్లకు రిమైండర్‌ సిగ్నల్‌లను అందించాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న మోడళ్లలోని కొన్ని వాహనాల్లో ఈ సిగ్నల్స్‌ సమయానికి అందడం లేదని, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని టెస్లా పేర్కొంది. ఈ తరహా లోపం కారణంగా ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

ఇంగ్లాండ్‌ నుంచి భారత్‌కు లక్ష కిలోల బంగారం తరలింపు

ఇప్పటివరకు సీట్‌ బెల్ట్‌ వార్నింగ్ సమస్యతో ప్రమాదాలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదని టెస్లా పేర్కొంది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు అందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మరోవైపు యాక్సిలరేటర్ పెడల్ సమస్య కారణంగా గత నెలలో టెస్లా 3,878 సైబర్‌ ట్రక్కులను రీకాల్‌ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో దాదాపు 2.2 మిలియన్‌ వాహనాలను టెస్లా రీకాల్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని