మనుషుల్లా ఉండటమే కష్టం’: టెస్లా రోబో

Eenadu icon
By Business News Team Published : 13 Oct 2024 00:56 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కాలిఫోర్నియా : టెస్లా రూపొందించిన ఆప్టిమస్‌ రోబో, ఒక గెస్ట్‌ మధ్య జరిగిన సంభాషణ ఆకట్టుకుంటోంది. ఆ వ్యక్తి అడిగిన ఓ ప్రశ్నకు రోబో ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. దానికి సంబంధించిన వీడియోను ఆ గెస్ట్‌ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

అమెరికాలోని కాలిఫోర్నియాలోని వార్నర్‌ బ్రదర్స్‌ ప్రాంగణంలో ‘వీ రోబో’కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. అందులో దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్‌మస్క్‌ నేతృత్వంలోని టెస్లా ఉత్పత్తులు ఆకట్టుకున్నాయి. ఆ సంస్థకు చెందిన హ్యుమనాయిడ్‌ రోబో ‘ఆప్టిమస్‌’ అన్నిపనులు చకచకా చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. అది పాల్గొన్న అతిథులందరికీ కబుర్లు చెబుతూ, డ్యాన్స్‌ చేస్తూ, డ్రింక్స్‌ అందిస్తూ సెల్ఫీలకు పోజులిచ్చింది. ఈ క్రమంలో ఒక గెస్ట్‌కు ఆప్టిమస్‌ రోబోకు మధ్య జరిగిన ఓ సంభాషణ సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది.

‘రోబోగా ఉండటంలో కష్టమైన పని ఏమిటి?’ అని అతడు ప్రశ్నించగా.. ‘‘మనుషుల్లా ఉండటం ఎలాగో నేర్చుకోవడమే నాకు అత్యంత కష్టమైన పని’’ అంటూ ఆప్టిమస్ బదులిచ్చింది. ఈ సమాధానంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇక ఈవెంట్‌లో రోబో ప్రదర్శన అనంతరం మస్క్‌ మాట్లాడుతూ..‘‘ఇది మీకు కావాల్సిన పనులన్నీ చేస్తుంది.  వంటగదిని శుభ్రం చేస్తుంది. గడ్డి కోస్తుంది. మీ పిల్లలను కూర్చోబెడుతుంది. ఇది ఒక టీచర్‌లా పనిచేస్తుంది. శునకాలను వాకింగ్‌కు తీసుకెళ్తుంది. మీకు కావాల్సిన రోజూవారీ పనుల్నీ చేస్తుంది’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని