Budget 2024: భారత తొలి బడ్జెట్‌.. ఈ ఆసక్తికర విశేషాలు తెలుసా?

దేశ తొలి బడ్జెట్‌ను అధికార పక్షంలోని వ్యక్తి కాకుండా.. మరో పార్టీ నేత ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ఓ రంగానికి దాదాపు సగం కేటాయింపులు చేశారు. తొలి బడ్జెట్‌ విశేషాలు..

Updated : 09 Jul 2024 15:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత తొలి బడ్జెట్‌ (Union Budget 2024)లో చాలా విశేషాలున్నాయి. ఈ బడ్జెట్‌ రహస్యాల లీక్‌ కారణంగా సీనియర్‌ మంత్రి రాజీనామా వంటి పరిణామాలు చోటు చేసుకొన్నాయి. 1947-48కి సంబంధించిన తొలి బడ్జెట్‌ను ఆర్‌.షణ్ముగం చెట్టి ప్రవేశపెట్టారు. ఆయన కాంగ్రెస్‌ నేత కాదు. బ్రిటిష్‌ అనుకూల పార్టీగా పేరున్న జస్టిస్‌ పార్టీ నేత. ఆయన ఓ పారిశ్రామిక వేత్త కూడా. కొచ్చిన్‌ స్టేట్‌ దివాన్‌గా పనిచేశారు. ఛాంబర్‌ ఆఫ్‌ ప్రిన్సెస్‌కు సలహాదారుగా వ్యవహరించారు.

  • తొలి బడ్జెట్‌ను 1947 నవంబర్‌ 26వ తేదీన ప్రవేశపెట్టారు. దీనిలో దేశ వ్యయం రూ.197.39 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. ఇందులో అత్యధికంగా రూ.92.74 కోట్లు (46శాతం) రక్షణ రంగానికే కేటాయించారు. దేశ ఆదాయం రూ.171 కోట్లు ఉంటుందని అంచనావేశారు. ఈ బడ్జెట్‌లో రూ. 24.59 కోట్ల ద్రవ్య లోటును చూపించారు.
  • అప్పట్లో బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు సభలో ప్రవేశపెట్టారు. ఎందుకంటే బ్రిటన్‌లోని రాజకీయ నాయకులు, సభ్యులు కూడా సౌకర్యవంతంగా దీనిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. బ్రిటన్‌కు అప్పుడు మధ్యాహ్న సమయం అవుతుంది.
  • తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందే.. యూకే ఛాన్సలర్‌ ఆఫ్‌ ఎక్స్‌చెకర్‌ (ఆర్థిక మంత్రి హోదా) హూ డాల్టన్‌ భారత బడ్జెట్‌లోని కీలకమైన పన్ను మార్పులను లీక్‌ చేశాడు. ఆయన ఓ జర్నలిస్ట్‌కు ఈ విషయాలను పిచ్చాపాటీ మాటల్లో చెప్పాడు. దీంతో సదరు విలేకరి మర్నాడు బడ్జెట్‌ ప్రతిపాదనలతో ఓ వార్తను ప్రచురించాడు. ఈ ఘటన తర్వాత హూ డాల్టన్‌ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
  • భారత బడ్జెట్‌లో గోప్యత అత్యంత కీలకమైంది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. బడ్జెట్‌ ప్రతిపాదనల సమయంలో ఆర్థిక శాఖలోని కీలక ఉద్యోగులు కొన్ని రోజులపాటు ఇళ్లకు కూడా వెళ్లరు. వారు కార్యాలయాలకే పరిమితమైపోతారు. వారి వద్దకు ఎవరినీ వెళ్లనీయరు.

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు