Internship: ఒక్క పదం నేర్పితే ₹3 లక్షలు ఇస్తారట.. ఒక రోజే పని

Internship: ఒక్క పదం నేర్పితే ఏకంగా రూ.3 లక్షలు స్టైఫండ్‌ ఇస్తామంటూ ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ బ్రిటానియా ప్రకటన విడుదల చేసింది.

Published : 10 Mar 2024 00:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఇంటర్న్‌షిప్‌ అంటే చాలా శ్రమించాలి. వచ్చే స్టైఫండ్‌ కూడా అంతంతే. అదే, ఒక్క రోజు పని చేస్తే చాలు.. రూ.లక్షల్లో సంపాదించే అవకాశం వస్తే ఎంత బాగుంటుందో కదా. మీకెప్పుడైనా అనిపించిందా? అయితే.. మీకో శుభవార్త. ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ అచ్చం అలాంటి ఇంటర్న్‌షిప్‌నే తీసుకొచ్చింది. ఒక్క రోజులోనే రూ.లక్షలు సంపాదించొచ్చంటూ ప్రకటన విడుదల చేసింది. అదీ ఒక పదాన్ని సరిగ్గా పలకడం నేర్పిస్తే చాలట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. 

బ్రిటానియా సంస్థ అర్ధచంద్రాకారపు ఆకృతిలో ఉండే ఫ్రెంచ్‌ పేస్ట్రీ ‘‘Croissant’’ను తయారుచేస్తోంది. అయితే.. సంస్థలోని ఉద్యోగులు ఈ పదాన్ని స్పష్టంగా పలకలేకపోతున్నారట. దీంతో సిబ్బందికి ఎలాగైనా ఈ పదాన్ని ఉచ్చరించడం నేర్పించాలనుకుంది. ఈ క్రమంలోనే ఆసక్తికరమైన ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. అయితే ఇది నెల రోజులో, వారం రోజులో అనుకుంటే పొరపాటే. కేవలం ఒక్క రోజు పనే. సంస్థలోని ఉద్యోగులకు ఆ పదాన్ని పలకడం నేర్పిస్తే చాలట. దీనికోసం ఏకంగా రూ.3 లక్షలు స్టైఫండ్‌ ఇస్తామంటూ ప్రకటించింది.

మన విమానం ఆకర్షణీయం

ఈ ఉద్యోగానికి సంబంధించిన ప్రకటనను కంపెనీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. పేరు, వయసు, ఇ-మెయిల్‌ తదితర వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అప్లై చేసుకోవడానికి రేపే (మార్చి10) చివరి తేదీ. ఈ పదాన్ని సరిగ్గా ఎలా పలకాలో తెలిస్తే.. ఈ ఇంటర్న్‌షిప్‌పై ఓ లుక్కేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని