forbes list: భారత సంపన్నుల్లో ముకేశ్‌దే అగ్రస్థానం.. టాప్‌-10లో ఉన్నది వీళ్లే

భారత కుబేరుల్లో ముకేశ్‌ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఆసియాలో ఒకటో స్థానంలో నిలవగా.. ప్రపంచ కుబేరుల జాబితాలో 9 స్థానంలో చోటు దక్కించుకున్నారు.

Published : 03 Apr 2024 20:19 IST

forbes list | ఇంటర్నెట్‌ డెస్క్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh ambani) దేశంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తిగా మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అటు ఆసియాలో నంబర్‌ 1 స్థానం కూడా ఆయనదే. ప్రపంచ కుబేరుల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. గతేడాది 83 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఆయన సంపద.. ఏడాదిలో భారీగా పెరిగి 116 బిలియన్‌ డాలర్లకు చేరిందని ఫోర్బ్స్‌ పేర్కొంది. ఆసియాలో 100 బిలియన్‌ క్లబ్‌లోకి చేరిన తొలి కుబేరుడుగా ముకేశ్‌ నిలిచారని తెలిపింది. ఈమేరకు ఫోర్బ్స్‌ 2024కు సంబంధించి బిలియనీర్ల జాబితాను ప్రకటించింది. 

125W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌.. అదిరిపోయే లుక్‌తో మోటో ఎడ్జ్‌ 50 ప్రో

గతేడాదితో పోలిస్తే ఈసారి భారత్‌లో బిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగిందని ఫోర్బ్స్‌ వెల్లడించింది. గతేడాది 169గా ఉన్న ఈ సంఖ్య 200కు పెరిగినట్లు తెలిపింది. బిలియనీర్ల మొత్తం సంపద సైతం 675 బిలియన్‌ డాలర్ల నుంచి 41 శాతం వృద్ధితో 954 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని పేర్కొంది. దేశీయ జాబితాలో అదానీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ 84 బిలియన్‌ డాలర్ల సంపదతో రెండో స్థానంలో నిలిచారు. ప్రపంచ కుబేరుల జాబితాలో 17వ స్థానంలో ఉన్నారు. 33.5 బిలియన్‌ డాలర్లతో దేశంలో నాలుగో స్థానంలో ఉన్న సావిత్రి జిందాల్‌.. సంపన్న మహిళల జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్‌ జాబితాలోకి 25 మంది కొత్తగా చోటు దక్కించుకోగా.. బైజూ రవీంద్రన్‌, రోహికా మిస్త్రీ వంటి వారు తమ స్థానాలను కోల్పోయారు.

టాప్‌-10 కుబేరులు వీరే..

  • ముకేశ్‌ అంబానీ - 116 బిలియన్‌ డాలర్లు
  • గౌతమ్‌ అదానీ - 84 బిలియన్‌ డాలర్లు
  • శివ్‌ నాడార్‌- 36.9 బిలియన్‌ డాలర్లు
  • సావిత్రి జిందాల్‌- 33.5 బిలియన్‌ డాలర్లు
  • దిలీప్‌ సంఘ్వీ - 26.7 బిలియన్‌ డాలర్లు
  • సైరస్‌ పూనావాలా - 21.3 బిలియన్‌ డాలర్లు
  • కుషాల్‌ పాల్‌ సింగ్‌ - 20.9 బిలియన్‌ డాలర్లు
  • కుమార్‌ బిర్లా - 19.7 బిలియన్‌ డాలర్లు
  • రాధాకృష్ణ దమానీ - 17.6 బిలియన్‌ డాలర్లు
  • లక్ష్మీ మిత్తల్‌ - 16.4 బిలియన్‌ డాలర్లు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని