Motorola Edge 50 Pro: 125W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌.. అదిరిపోయే లుక్‌తో మోటో ఎడ్జ్‌ 50 ప్రో

మోటో ఎడ్జ్‌ 50 ప్రో ఫోన్‌ను ఏప్రిల్‌ 3న భారత్‌లో లాంచ్‌ చేసింది. ఏప్రిల్‌ 9 నుంచి ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి.

Published : 03 Apr 2024 17:08 IST

Motorola Edge 50 Pro | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ మోటోరొలా (Motorola) కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. అదిరిపోయే లుక్‌తో ఎడ్జ్‌ సిరీస్‌లో ఎడ్జ్‌ 50 ప్రోను తీసుకొచ్చింది. ముందూ వెనుక 50 ఎంపీ కెమెరాలతో వస్తున్న ఈ ఫోన్‌.. 125W పాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. కర్వ్‌డ్‌ డిస్‌ఫ్లే.. ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ. పైగా మూడేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ చెబుతోంది.

మోటో ఎడ్జ్‌ 50 ప్రో రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.31,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.35,999గా కంపెనీ పేర్కొంది. ప్రారంభ ఆఫర్‌ కింద బేస్‌ వేరియంట్‌ను రూ.27,999కు, 12జీబీ ర్యామ్‌ వేరియంట్‌ను రూ.31,999కు విక్రయించనున్నట్లు మోటో తెలిపింది. ఏప్రిల్‌ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, మోటో ఆన్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. బ్లాక్‌ బ్యూటీ, లక్స్‌ లావెండర్‌, మూన్‌లైట్‌ పెర్ల్‌ రంగుల్లో లభిస్తాయి. HDFC క్రెడిట్‌/ డెబిట్‌ కార్డుతో కొనుగోళ్లపై రూ.2,250 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ అందిస్తున్నారు. రూ.2000 ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ ఇస్తున్నారు. అంటే పాత ఫోన్‌ విలువపై రూ.2వేలు అదనంగా చెల్లిస్తారు.

కేరళ ప్రకృతి అందాలు చూస్తారా? ₹14 వేల నుంచే IRCTC ప్యాకేజీ

మోటో ఎడ్జ్‌ 50 ప్రోలో 6.7 అంగుళాల 1.5K పీఓఎల్‌ఈడీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 144Hz రిఫ్రెష్‌ రేటుకు సపోర్ట్‌ చేస్తుంది. 2000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హెలో యూఐతో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 17 వరకు అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ చెబుతోంది. వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో వస్తోంది. 13 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 10 టెలిఫొటో లెన్స్‌ అమర్చారు. సెల్ఫీల కోసం 50 ఎంపీ కెమెరా ఇస్తుండడం విశేషం. ఇందులో 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 125W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు, 50W వైర్‌లెస్‌ టర్బో ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 12జీబీ వేరియంట్‌తో మాత్రమే 125W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఇస్తున్నారు. బేస్‌ వేరియంట్‌తో 68W ఫాస్ట్‌ ఛార్జర్‌ మాత్రమే బాక్స్‌లో ఉంటుంది. ఐపీ68 రేటింగ్‌తో వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని