Amazon Sale: అమెజాన్‌ రిపబ్లిక్‌ డే సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌

Amazon Great Republic Day sale: కొత్త స్మార్ట్‌ఫోన్‌ డిస్కౌంట్‌తో కొనాలని చూస్తున్నారా? అయితే అమెజాన్‌ తీసుకొస్తున్న ‘గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌’ ఆఫర్లపై ఓ లుక్కేయండి.  

Updated : 24 Jan 2024 17:23 IST

Amazon Great Republic Day sale | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (Amazon) ‘గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌’ (Great Republic Day Sale)కు సిద్ధమైంది. రేపు (జనవరి 13) మధ్యాహ్నం నుంచి సేల్‌ ప్రారంభం కానుందని తెలిపింది. ప్రస్తుతం మొబైల్‌ ఫోన్లపై ఉన్న రాయితీలు, ఆఫర్లను సైట్‌లో ప్రదర్శించింది. శాంసంగ్‌, రియల్‌మీ, ఐకూ, వన్‌ప్లస్‌, వివోతో పాటు ఇతర కంపెనీల ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది.

ఐకూ నియో 7 5జీ (iQoo Neo 7 5G) ఫోన్‌ ఎమ్మార్పీ ధర రూ.29,999 ఉండగా.. సేల్‌ సమయంలో రూ.23,999కే కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్‌ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.30,999 కాగా, ఆఫర్‌లో భాగంగా రూ.25,999కే లభిస్తుంది. రూ.29,999 వద్ద విడుదలైన టెక్నో క్యామాన్‌ ప్రీమియర్‌ 5జీ (Tecno Camon 20 Premier 5G) రూ.23,999కే పొందొచ్చు. వన్‌ప్లస్ నార్డ్3 5జీ (OnePlus Nord 3 5G) ఫోన్ రూ.6వేల తగ్గింపుతో రూ.26,999కే అందిస్తోంది. రియల్‌మీ నార్జో 60 ప్రో (Realme Narzo 60 Pro) రూ.21,999కే కొనుగోలు చేయొచ్చు. వివో వై200 5జీ (Vivo Y200 5G) ఎమ్మార్పీ ధర రూ.21,999గా ఉంది. ఆఫర్‌ సమయంలో రూ.20,499కే లభిస్తోంది. రూ.30వేల లోపు స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్న వారు వీటిని పరిశీలించొచ్చు. బ్యాంక్‌ ఆఫర్లు, సేల్‌ ప్రత్యేక తగ్గింపు, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లను కలిపిన తర్వాత ఈ ధరలు వర్తిస్తాయి.

రిలయన్స్‌లో ఉద్యోగాలు.. బీటెక్‌ విద్యార్థులకు సదవకాశం

ఐఫోన్‌ 13 (iPhone 13 )ను ఈ సేల్‌లో తక్కువ ధరకే విక్రయించనుంది. దీని ఎమ్మార్పీ రూ.59,900 కాగా.. సేల్‌లో రూ.48,999కే కొనుగోలు చేయొచ్చని అమెజాన్‌ తెలిపింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 5జీ (Samsung Galaxy s23 5G)పై  రాయితీ అందిస్తోంది. ప్రస్తుతం రూ.64,999కు విక్రయిస్తున్న మొబైల్‌ను ఆఫర్‌ సమయంలో రూ.54,999కే కొనుగోలు చేయొచ్చు. రూ.1,19,999 వద్ద విడుదలైన మోటొరోలా రేజర్‌ 40 అల్ట్రా (Motorola Razr 40 Ultra) కేవలం రూ.69,999కే లభించనుంది. వీటితో పాటూ ఈ సేల్‌లో హెడ్‌ఫోన్లపై 75శాతం, ఇంటి ఉపకరణాలపై 55శాతం రాయితీ అందించనుంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్‌ కూడా పొందొచ్చని అమెజాన్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని