Toyota: భారత్‌ మార్కెట్‌లోకి టయోటా అర్బన్‌ క్రూయిజ‌ర్ టేసర్‌

టయోటా భారత్‌లో తన అర్బన్‌ క్రూయిజ‌ర్ టేసర్‌ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.7.73 లక్షలు.

Updated : 06 Apr 2024 17:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ బుధవారం భారత్‌లో అర్బన్‌ క్రూయిజ‌ర్ టేసర్‌ను విడుదల చేసింది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌ రీబ్యాడ్జ్‌ వెర్షన్‌ ఇది. టేసర్‌ ధర రూ.7.73 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మారుతీ-టయోటా భాగస్వామ్యంలో రూపుదిద్దుకుంటున్న 6వ మోడల్‌ ఇది. ఈ కారు టాటా నెక్సాన్‌, నిస్సాన్‌ మాగ్నైట్‌, కియా సోనెట్‌ వంటి ప్రముఖ మోడళ్లతో పోటీపడుతుంది. టయోటా టేసర్‌ 1.0L టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌, 1.2L పెట్రోల్‌ ఇంజిన్‌తో రెండు వేరియంట్లలో విడుదల అయ్యింది. టయోటా దాని సీఎన్‌జీ వెర్షన్‌ను కూడా అందిస్తోంది. టయోటా.. టేసర్‌ కోసం బుకింగ్‌ విండోను కూడా తెరిచింది.

మరిన్ని ప్రీమియం మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు టయోటా తెలిపింది. ఇన్నోవా, ఫార్చ్యూనర్‌ వంటి మోడళ్లను విక్రయిస్తున్న ఈ కంపెనీ.. క్రమంగా మార్కెట్లో పెద్ద సైజు వాహనాల వైపు అడుగులు వేస్తోంది. దేశంలో తమ పోర్ట్‌ఫోలియోలో హైబ్రిడ్‌, బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనాలు సహా విభిన్న పవర్‌ట్రెయిన్‌లతో కూడిన మోడళ్లను కలిగి ఉండాలని కంపెనీ యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టయోటాకు భారత మార్కెట్‌ చాలా ముఖ్యమైనదని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించిన భారత ఆటో మార్కెట్‌తో పాటుగా వృద్ధి చెందాలని వాహన తయారీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ డిప్యూటి మేనేజింగ్‌ డైరెక్టర్‌ తదాషి అసజుమా (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని