Airtel: ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ రూ.2.81 కోట్ల జరిమానా

TRAI penalty on Bharti Airtel: ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ జరిమానా విధించింది. అనధికారిక కాల్స్‌ను నిరోధించడంలో విఫలమైనందుకు ఈ జరిమానా వేసింది.

Updated : 29 Sep 2023 18:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌కు (Bharti Airtel) టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) రూ.2.81 కోట్ల జరిమానా విధించింది. అనధికారిక వాణిజ్య కాల్స్‌ను నిరోధించడంలో విఫలమైనందుకు పెనాల్టీ విధించింది. టెలికాం కమర్షియల్‌ కమ్యూనిషన్స్‌ కస్టమర్‌ ప్రిఫరెన్స్‌ రెగ్యులేషన్స్‌, 2018 నిబంధనలు ఉల్లంఘించినందుకు 2021 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి గానూ ట్రాయ్‌ ఈ జరిమానా విధించినట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎయిర్‌లెట్‌ పేర్కొంది. 

LIC పాలసీ పునరుద్ధరణ.. నచ్చిన కార్డ్‌ ఎంపిక.. అక్టోబర్‌లో మార్పులు ఇవే..!

అయితే, ట్రాయ్ అదేశాలను సమీక్షిస్తున్నామని, ఈ విషయంలో తదుపరి ఏం నిర్ణయం తీసుకోవాలన్నది పరిశీలిస్తున్నామని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. మరోవైపు చందాదారులను ఇబ్బంది పెడుతున్న ప్రచార సందేశాలు, కాల్స్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని గతంలో టెలికాం సంస్థలకు ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసింది. అనధికారిక కాల్స్‌, సందేశాలకు సంబంధించి ఆయా సంస్థల నుంచి డేటా కూడా సేకరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని