Twitter: కోలుకోని ట్విటర్‌.. సగానికి పడిపోయిన ప్రకటనల ఆదాయం: మస్క్‌

సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌ భారీగా నగదులోటును ఎదుర్కొంటోంది. ఈ విషయాన్ని మస్క్‌ స్వయంగా వెల్లడించారు.  

Updated : 16 Jul 2023 15:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ట్విటర్‌ (Twitter)లో నగదు కొరత తీవ్రంగా ఉందని దాని యజమాని ఎలాన్‌ మస్క్‌  (Elon Musk) ఆదివారం పేర్కొన్నారు. ముఖ్యంగా వాణిజ్య ప్రకటనల ఆదాయం సగానికి పడిపోవడం, భారీగా రుణాలు ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. ప్రస్తుతం మస్క్‌ కంపెనీ సీటీవోగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అన్నిటికంటే ముందు నగదు నిల్వల ఏర్పాటు చేసుకొనే స్థితికి ట్విటర్‌ చేరుకోవాలన్నారు. ఓ వినియోగదారుడు మస్క్‌ను ట్విటర్‌లో పెట్టుబడుల పునర్‌ వ్యవస్థీకరణపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 

‘‘ వాణిజ్య ప్రకటనల ఆదాయంలో 50శాతం తగ్గుదల కారణంగా మేము ఇంకా నగదు లోటులోనే కొనసాగుతున్నాం.దీనికి తోడు రుణభారం చాలా ఎక్కువగా ఉంది. లోటు నుంచి మిగులు దశకు చేరడం చాలా ముఖ్యం’’ అని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఏడాది 4.5 బిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తుందని అంచనావేశారు. కానీ, తర్వాత ఆ అంచనాలను కూడా 3 బిలియన్‌ డాలర్లకు కుదించారు. 2021లో 5.1 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 

1985లో రూ.10,000 పెట్టుబడి.. ప్రస్తుతం రూ.300 కోట్లకు పైనే..

మస్క్‌ ట్విటర్‌ ఆధీనంలోకి తీసుకొన్నప్పటి నుంచి వ్యయనియంత్రణ చర్యలు చేపట్టారు. కానీ, అవేవీ ఇప్పటి వరకు  సత్ఫలితాలిస్తున్నట్లు కనిపించడంలేదు. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. మస్క్‌ ఆశించిన స్థాయిలో ట్విటర్‌ ఆదాయం పెరగలేదు. 

టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ట్విటర్‌ను ప్రయోగశాలగా మార్చేశారు. రోజుకో రూల్ తీసుకొస్తూ యూజర్ల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఇప్పటికే బ్లూ టిక్, సబ్ స్క్రిప్షన్  పేరిట నిబంధనలు పెట్టిన మస్క్.. ఎక్కువ మంది వెరిఫై అకౌంట్లు తీసుకునేలా సరికొత్త ప్లాన్ వేశాడు. పోస్టులను చూసేందుకు లిమిట్ సెట్ చేశాడు. ఒక రోజులో ఎవరు ఎన్ని పోస్టులను చదవవచ్చనే దానిపై తాత్కాలిక పరిమితులను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్యలతో వినియోగదారులు కూడా కొంత అసంతృప్తికి గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని