Uber buses: ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు

దేశ రాజధాని దిల్లీలో ఉబర్‌ సంస్థ బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. ఈమేరకు లైసెన్స్‌ అందుకుంది.

Published : 20 May 2024 20:24 IST

Uber buses | దిల్లీ: ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ (Uber) త్వరలో బస్సు సేవలను ప్రారంభించనుంది. దేశ రాజధాని నగరం దిల్లీలో తొలుత ఈ సేవలను ప్రారంభించనుంది. దిల్లీ ప్రీమియం బస్‌ స్కీమ్‌ కింద ఇకపై బస్సులను నడపనుంది. ఈ మేరకు దిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా లైసెన్స్‌ అందుకుంది. ఈ తరహా లైసెన్స్‌ జారీ చేసిన తొలి రవాణా శాఖ దిల్లీనే. దీన్ని అందుకున్న తొలి అగ్రిగేటర్‌గా ఉబర్‌ నిలిచింది.

ఏడాదిగా దిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు, కోల్‌కతాలోనూ ప్రయోగాత్మకంగా ఈ సేవలు నడుపుతున్నామని ఉబర్‌ షటిల్‌ ఇండియా హెడ్‌ అమిత్‌ దేశ్‌పాండే చెప్పారు. దిల్లీలో బస్సులకు విపరీతమైన డిమాండ్‌ ఉన్నట్లు గమనించామన్నారు.  ఇప్పుడు అధికారికంగా తమ సేవలను దిల్లీలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. బస్సు సర్వీసులకు వారం ముందు నుంచే ప్రయాణికులు బుక్‌ చేసుకోవచ్చని ఉబర్‌ తెలిపింది. బస్సు రాబోయే సమయం, బస్సు లైవ్‌ లొకేషన్‌, బస్సు రూట్లను ఎప్పటికప్పుడు ఉబర్‌ యాప్‌లో తెలుసుకోవచ్చని పేర్కొంది. ఒక్కో సర్వీసులో 19-50మంది ప్రయాణించడడానికి వీలుంటుందని తెలిపింది. ఉబర్‌ టెక్నాలజీ సాయంతో స్థానిక ఆపరేటర్లు వీటిని నడుపుతారని ఉబర్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని