Hello! UPI: ఏప్రిల్‌ నుంచి ‘హలో! యూపీఐ’.. వాయిస్‌ కమాండ్‌తోనే లావాదేవీలు!

Hello! UPI: సంభాషణల ద్వారా చెల్లింపుల ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సెప్టెంబర్‌లోనే ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ నుంచి అవి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Published : 02 Nov 2023 12:39 IST

Hello! UPI | ఇంటర్నెట్‌ డెస్క్‌: యూపీఐ చెల్లింపుల (UPI Payments)ను మరింత సులభతరం చేయడం కోసం ఆర్‌బీఐ అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా వాయిస్‌ కమాండ్‌ ఆధారిత చెల్లింపులను ప్రవేశపెడుతున్నట్లు సెప్టెంబర్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కొత్త సదుపాయం వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ‘నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI)’ తాజాగా ఉత్వర్తులు జారీ చేసింది. ‘హలో! యూపీఐ (Hello! UPI)’ ఫీచర్‌ను మార్చి 31 నాటికి యాప్‌లలో అందుబాటులోకి తేవాలని సూచించింది.

చెల్లింపుల్లో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లను ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగానే ‘హలో! యూపీఐ (Hello! UPI)’ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ఎన్‌పీసీఐ బ్యాంకులకు పంపిన మార్గదర్శకాల్లో పేర్కొంది. బ్యాలెన్స్‌ ఎంక్వైరీ, కొత్త యూజర్ల చేరిక, లావాదేవీలు, ఫిర్యాదుల పరిష్కారం.. ఇలా అన్నీ సంభాషణల ద్వారానే జరిగేలా యాప్‌లలో మార్పులు తీసుకురావాలని సూచించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న యాప్‌లన్నీ ఈ మార్పులు చేయాలని చెప్పింది.

‘హలో! యూపీఐ (Hello! UPI)’ సహా UPI, UPI లైట్ X, ట్యాప్ అండ్‌ పే, బిల్‌పే కనెక్ట్‌ వంటి కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నట్లు సెప్టెంబర్‌లో జరిగిన ‘గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ 2023’లో ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI)’ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. ‘హలో! యూపీఐ (Hello! UPI)’ ఫీచర్‌తో యూజర్లు వాయిస్‌ కమాండ్లతో లావాదేవీలను పూర్తి చేసే వెసులుబాటు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం, లేదా కీప్యాడ్‌ ద్వారా ఎంటర్‌ చేసి లావాదేవీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు