Wipro Walk-In: విప్రో వాక్‌-ఇన్‌కు క్యూ కట్టిన నిరుద్యోగులు

గత కొద్దిరోజులుగా విప్రో సంస్థ దేశంలోని వివిధ నగరాల్లోని కార్యాలయాల్లో వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కోల్‌కతా కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగార్థులు వచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 10 Aug 2023 17:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది చివరి నుంచి ఐటీ దిగ్గజ సంస్థలు లేఆఫ్‌లు అమలు చేస్తున్నాయి. దీంతో ఉద్యోగం కోల్పోయిన వారు మరో అవకాశం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడ వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు జరిగినా ఉద్యోగార్థులు తమ వివరాలతో ఆయా సంస్థల ముందు క్యూ కడుతున్నారు. తాజాగా, కోల్‌కతాలో విప్రో సంస్థ చేపట్టిన వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలకు పెద్ద ఎత్తున ఉద్యోగార్థులు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

‘‘వీడియోలో ఉన్న వారంతా కోల్‌కతాలోని విప్రో క్యాంపస్‌లో వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూల కోసం వచ్చారు. సంస్థ ఖాళీలు ప్రకటించింది తక్కువ ఉద్యోగాలకే అయినా.. సుమారు పదివేల మంది ఇంటర్వ్యూ కోసం వచ్చారు. దేశంలో జాబ్‌ మార్కెట్‌ పరిస్థితికి ఇది నిదర్శనం’’ అంటూ ఓ యూజర్‌ ఎక్స్ (Twitter)లో వీడియో షేర్‌ చేశాడు. గత కొద్దిరోజులుగా విప్రో సంస్థ దేశంలోని వివిధ నగరాల్లోని కార్యాలయాల్లో వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కోల్‌కతా కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగార్థులు రావడం గమనార్హం. 

కీలక వడ్డీరేట్లు యథాతథమే

ఈ వీడియో చూసిన నెటిజన్లు దేశంలో జాబ్ మార్కెట్‌ పరిస్థితిపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘జాబ్‌ మార్కెట్‌ ఎప్పుడూ ఒడుదొడుకులకు గురవుతూనే ఉంటుంది. అమెరికాలో అధిక వడ్డీరేట్లు ఆ దేశంలో కంటే భారత్‌లోని ఉద్యోగాలపైనే అధిక ప్రభావం చూపాయి’ అని ఒక యూజర్‌ కామెంట్‌ చేయగా.. ‘వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు ఎప్పుడూ అంత సులభం కాదు’ అంటూ మరో యూజర్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు