Vodafone Idea: వొడాఫోన్ ఐడియా కొత్త డేటా ప్లాన్లు

Vodafone Idea: ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా రెండు డేటా ప్లాన్లకు తీసుకొచ్చింది.

Updated : 05 Jul 2023 12:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) మరో రెండు డేటా ప్లాన్లకు తీసుకొచ్చింది. యాక్టివ్‌ బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ కస్టమర్ల కోసం వీటిని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. కేవలం రూ.24, రూ.49 తో వీటిని తీసుకొచ్చింది. 5జీ విస్తరణలో వెనకబడిన వీఐ పెద్ద సంఖ్యలో కస్టమర్లను కోల్పోతోంది. దీంతో వీఐ యూజర్లను కాపాడుకునేందుకు కొత్త ప్లాన్లు, ఆఫర్లు తీసుకొస్తోంది.

వొడాఫోన్‌ ఐడియా సూపర్‌ హవర్ పేరుతో డేటా ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ను కేవలం రూ.24తో వినియోగించుకోవచ్చు. అయితే ఈ డేటా ప్లాన్‌ను కేవలం గంటలోపే వినియోగించుకోవాలి. ఆ గంట సమయంలో డేటాపై ఎటువంటి పరిమితులు ఉండవు. అన్‌లిమిటెడ్‌ డేటా లభిస్తుంది. అయితే వీఐ తెస్తున్న ఈ వన్‌ హవర్ ప్లాన్ కొత్తది కాదు. ఇంతకు ముందు అందిస్తున్న ప్లాన్‌నే తిరిగి ప్రవేశపెట్టింది. దీంతో పాటు వీఐ మరో డేటా ప్లాన్‌ను యూజర్లకు పరిచయం చేసింది. రూ.49 రీఛార్జితో 6 జీబీ డేటా అందిస్తుంది. అయితే ఈ డేటాకు ఒక రోజు వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని