అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌తో వీఐ కొత్త ప్లాన్‌..

Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియా సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ తీసుకొచ్చింది. 

Published : 27 May 2024 00:09 IST

Vodafone Idea | ఇంటర్నెట్‌డెస్క్‌: కస్టమర్లను ఆకట్టుకోవడంలో భాగంగా ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) మరో రీఛార్జి ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఓటీటీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఆ తరహా సదుపాయంతో రూ.904 తో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను (prepaid plan) ప్రవేశపెట్టింది.

వొడాఫోన్‌ ఐడియా కొత్తగా తీసుకొచ్చిన రూ.904 ప్లాన్‌ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. రోజుకు 2జీబీ డేటా అంటే మొత్తం 180జీబీ డేటా ఈ ప్లాన్‌తో లభిస్తుంది. అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 90 రోజుల పాటు అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు. దీంతో పాటు వీఐ హీరో అన్‌లిమిటెడ్‌ సదుపాయాలు అందిస్తోంది. అంటే ఆల్‌ నైట్‌ హై-స్పీడ్‌ అపరిమిత డేటా, వీకెండ్‌ డేటా రోల్‌ఓవర్‌ వంటి ఫీచర్లు పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు