Vodafone Idea: వొడాఫోన్‌ నష్టం రూ.6,986 కోట్లు

Vodafone Idea  results: వొడాఫోన్‌ ఐడియా నష్టం కాస్త తగ్గింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.6,986 కోట్ల నికర నష్టాన్ని ఆ కంపెనీ ప్రకటించింది.

Published : 29 Jan 2024 23:47 IST

Vodafone Idea | దిల్లీ: ప్రముఖ టెలికాం ఆపరేటర్‌ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.6,986 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ మొత్తం రూ.7,990 కోట్లుగా ఉంది. గతంతో పోలిస్తే నష్టాలు తగ్గినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కంపెనీ ఆదాయం ఫ్లాట్‌గా నిలిచింది. గతేడాది కార్యకలాపాల ద్వారా రూ.10,620.6 కోట్లు ఆర్జించగా.. ఈ ఏడాది రూ.10,673.1 కోట్లు ఆదాయం వచ్చింది. మూడో త్రైమాసికంలో ఒక వ్యక్తి ద్వారా వచ్చే సగటు ఆదాయం (ARPU) రూ.135 నుంచి రూ.145కు పెరిగిందని కంపెనీ పేర్కొంది.

గడిచిన 11 నెలలుగా 21.4 బిలియన్‌ డాలర్ల ఎబిటా నమోదు చేసినట్లు కంపెనీ సీఈఓ అక్షయ ముంద్రా తెలిపారు. మార్కెట్‌ పరిస్థితులు, కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టామన్నారు. అందుకే గడిచిన 10 త్రైమాసికాలుగా 4జీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య, ఆర్పు పెరుగుతోందని పేర్కొన్నారు. నెట్‌వర్క్‌ విస్తరణ, 5జీ నెట్‌వర్క్‌ ప్రారంభానికి నిధుల సమీకరణ కోసం వివిధ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని