Vedantu: రెండేళ్లలో ఐపీఓకు వస్తాం

Eenadu icon
By Business News Desk Published : 29 May 2024 03:29 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

వేదాంతు సీఈఓ వంశీ కృష్ణ

ఈనాడు, హైదరాబాద్‌: ఇన్నాళ్లూ పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణను ఆన్‌లైన్‌లో అందించిన తాము, వేదాంతు లెర్నింగ్‌ సెంటర్‌ పేరుతో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ప్రత్యక్ష (ఆఫ్‌లైన్‌) తరగతులు నిర్వహించబోతున్నట్లు ఎడ్యుటెక్‌ అంకుర సంస్థ వేదాంతు సహ వ్యవస్థాపకుడు, సీఈఓ వంశీ కృష్ణ తెలిపారు. ఇందుకోసం విజ్ఞాన్‌తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంగళవారం ఇక్కడ వివరించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లో 4, విజయవాడ, విశాఖపట్నంలలో ఒక్కోటి చొప్పున మొత్తం 6 కేంద్రాలను ప్రారంభించామని, వచ్చే ఏడాది వివిధ నగరాల్లో మరో 10 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 40 కేంద్రాలున్నాయని, వీటి సంఖ్య రెండేళ్లలో 200కు చేరుతుందన్నారు. 2021-22లో రెండు విడతల్లో 20 కోట్ల డాలర్ల నిధులను సమకూర్చుకున్నామని, వీటినే విస్తరణ ప్రణాళికలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. సగటున 30% వృద్ధి సాధిస్తున్నామని, ఈ ఏడాది నుంచి లాభదాయకతపై దృష్టి పెట్టినట్లు వివరించారు. 2026-27 నాటికి తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు వచ్చే ఆలోచనతో ఉన్నట్లు వివరించారు. ఆఫ్‌లైన్‌ క్యాంపస్‌ల కోసం రూ.30-40 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని