Mutual Funds: ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లపై రాబడులు ఎంతెంత?

ప్లెక్సీక్యాప్‌ ఫండ్లు లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాయి. మంచి ఫలితాలను అందించిన కొన్ని ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు.

Published : 10 Aug 2023 16:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: స్టాక్‌ మార్కెట్‌లో అస్థిరత గురించి ఆందోళన చెందేవారికి మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు ఒక మంచి మార్గమని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో మ్యూచువల్‌ ఫండ్లు మంచి రాబడులను ఇస్తున్నాయి. సిప్‌ల ద్వారా మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినట్లయితే మీరు రిస్క్ తగ్గించుకుని మెరుగైన రాబడి పొందొచ్చు. మార్కెట్ క్యాపిటలైజేషన్‌ ప్రకారం వివిధ రంగాలలో పెట్టుబడి పెట్టే విభిన్న ఈక్విటీ ఫండ్లు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్లుగా పిలిచే వాటిని 2020కి ముందు మల్టీక్యాప్‌ పథకాలుగా పిలిచేవారు. స్మాల్‌ క్యాప్‌ ఫండ్లతో పోలిస్తే, ప్లెక్సీక్యాప్‌ పథకాలు మితమైన రిస్క్‌ను కలిగి ఉంటాయి.

ఫ్లెక్సిక్యాప్‌ ఫండ్‌లు కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో సంబంధం లేకుండా ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టవచ్చు. ఫండ్‌ మేనేజర్‌ దాని పరిమాణంతో సంబంధం లేకుండా వివిధ కంపెనీల వృద్ధి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్లు విభిన్నమైన పోర్ట్‌ఫోలియోను అందిస్తాయి. దీని కారణంగా ఫండ్‌ రిస్క్‌, రిటర్న్‌ అంశాలను బ్యాలెన్స్‌ చేస్తుంది. మంచి రాబడి కోసం రిస్క్ తీసుకోగలిగే వారికి ఇది మంచి ఎంపిక.

3, 5, 10 సంవత్సరాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఫ్లెక్సీక్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లను ఇక్కడ చూడండి..

గమనిక: ఈ డేటా 2023 ఆగస్టు 9 నాటిది. మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్‌ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. ఇవే ఫలితాలు భవిష్యత్‌లోనూ వస్తాయన్న హామీ లేదు. ఇందులో పెట్టుబడులు పెట్టేముందు (SEBI రిజిష్టర్డ్‌) ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ను సంప్రదించడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని