Gold Loans: బంగారు రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?

సురక్షితమైన రుణం కాబట్టి, బ్యాంకులు బంగారంపై సరసమైన వడ్డీ రేట్లకు వేగంగా రుణాలందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం.

Updated : 27 Jun 2024 14:31 IST

వ్యక్తిగత రుణాలను చాలామంది ఏదో ఒక సందర్భంలో తీసుకుంటుంటారు. వ్యక్తిగత/వ్యాపార అవసరాలకు, పిల్లల ఫీజులకు, వైద్య అవసరాల నిమిత్తం రుణాలు తీసుకోవడం ఎక్కువగా జరిగేదే. బంగారం తాకట్టు పెట్టి సరసమైన వడ్డీకే రుణాలు పొందొచ్చు. బంగారం తాకట్టు పెడతారు కాబట్టి, క్రెడిట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకోకుండానే బ్యాంకులు రుణాన్ని మంజూరు చేస్తాయి. బ్యాంకు, రుణ మొత్తాన్ని బట్టి ఈ రుణాలపై వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. బంగారం విలువపై 65% నుంచి 75% వరకు రుణాన్ని పొందొచ్చు. రుణ ప్రాసెస్‌ సమయం, ఫీజులు బ్యాంకును బట్టి మారుతుంటాయి. చాలా బ్యాంకులు రుణ మొత్తంలో 0.50% నుంచి 1% వరకు ప్రాసెసింగ్‌ ఛార్జీగా వసూలు చేస్తున్నాయి. 

బంగారు రుణాలపై వివిధ బ్యాంకులు/NBFCలు వసూలు చేసే వడ్డీ రేట్లు కింది పట్టికలో ఉన్నాయి..

గమనిక:  రుణ మొత్తం, వయసు, వివిధ పరిస్థితుల ఆధారంగా వడ్డీ రేట్లు మారుతుంటాయి. ప్రాసెసింగ్‌ రుసుములు, ఇతర ఛార్జీలు పై పట్టికలో తెలపలేదు, అవి బ్యాంకును బట్టి మారతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని