Anant-Radhika: లగ్జరీ నౌకలో అనంత్‌-రాధిక ప్రీవెడ్డింగ్‌.. సెకండ్‌ డే ‘టోగా పార్టీ’ స్పెషల్‌

అనంత్‌-రాధిక (Anant-Radhika) కోసం అంబానీ కుటుంబం మరో ప్రీవెడ్డింగ్ పార్టీ ఇస్తోంది. లగ్జరీ క్రూజ్‌ షిప్‌ అందుకు వేదికైంది. 

Updated : 30 May 2024 15:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ కుబేరుడు ముకేశ్‌ అంబానీ కుటుంబం మరోసారి గ్రాండ్ పార్టీ ఇస్తోంది. జులైలో చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ (Anant-Radhika) వివాహం జరగనున్న తరుణంలో.. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు చేస్తోంది. అయితే ఈసారి నడి సంద్రంలో ఒక క్రూజ్ షిప్‌లో అతిథులకు ఐరోపా స్టైల్‌లో ఆతిథ్యం రుచి చూపించనుంది. మే 29 నుంచి జూన్ ఒకటి వరకు పలురకాల థీమ్స్‌లో ఈ పార్టీలు జరుగుతున్నాయి. ఇక రెండో రోజు రోమన్‌ హాలిడే పేరిట ‘టోగా పార్టీ’ నిర్వహించనున్నారు.

ఆ సందర్భంగా అందరూ గ్రీక్‌-రోమన్‌ సంస్కృతిని ప్రతిబింబించేలా దుస్తులు ధరించనున్నారు. అవి పురాతన రోమన్లు ధరించిన వస్త్రాలను పోలిఉంటాయి. వాటిని సాధారణంగా దుప్పట్లతో తయారుచేస్తారు. వాటికి జతగా శాండిల్స్‌ వేసుకుంటారు. అంతా ఆటపాటలతో ఎంజాయ్‌ చేస్తారు. ఇక, ఈ లగ్జరీ క్రూజ్‌ షిప్‌లో ఇటలీ నుంచి ఫ్రాన్స్‌ వరకు ప్రయాణించి సముద్ర అందాలను వీక్షించనున్నారు. ఈసారి 800 మంది గెస్ట్‌లకు అంబానీ కుటుంబం ఆతిథ్యం ఇస్తోంది.

Radhika-Anant: అలా ప్రేమలో పడ్డారు..!

 వీరి వివాహం జులై 12న జరగనుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. జులై 14న అతిథులకు విందు ఇవ్వనున్నారు. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదిక కానుందని తెలుస్తోంది. ఈ వివరాలతో కూడిన వెడ్డింగ్ కార్డ్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ జంట ఇప్పటికే మార్చిలో ఒకసారి ప్రీవెడ్డింగ్‌ పార్టీ ఇచ్చింది. ఈ వేడుకలకు ప్రపంచస్థాయి ప్రముఖులు హాజరయ్యారు. దాంతో అందుకు వేదికైన గుజరాత్‌లోని జామ్‌నగర్‌ పేరు అంతర్జాతీయంగా వినిపించింది. ముందస్తు వేడుకలే ఇంత అట్టహాసంగా జరుగుతుంటే.. ఇక పెళ్లి ఏ స్థాయిలో ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు