Anand Mahindra: ఆనంద్‌ మహీంద్రా మ్యాచ్‌ చూడడం లేదట.. ఎందుకో తెలుసా?

Anand Mahindra: యావత్‌ భారతదేశం క్రికెట్‌ మ్యాచ్‌ వీక్షిస్తుంటే ఆనంద్‌ మహీంద్రా మాత్రం ఓ గదికి పరిమితమయ్యారు. ఇదీ జట్టు గెలుపు కోసమేనట! అదెలాగో చూద్దాం! 

Published : 19 Nov 2023 16:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరల్డ్‌ కప్‌ 2023 (World Cup 2023) నేపథ్యంలో యావత్‌ భారతావని ఆదివారం టీవీలకు అతుక్కుపోయింది. కానీ, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) మాత్రం మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. పైగా దేశ సేవలో భాగంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానంటూ సమర్థించుకున్నారు.

‘‘నేను వరల్డ్‌ కప్‌ (World Cup 2023) ఫైనల్‌ మ్యాచ్‌ చూడడానికి ప్లాన్‌ చేసుకోవడం లేదు (ఇది దేశానికి నేను చేస్తున్న సేవ). కానీ, ఈ జేర్సీ (‘ఎక్స్‌’లో జెర్సీ ఫొటోను పోస్ట్‌ చేశారు) ధరించి ఓ గదికి పరిమితమవుతాను. ఎవరైనా వచ్చి మనం గెలిచామని చెప్పే వరకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటాను’’ అని మహీంద్రా తెలిపారు. నిజానికి మహీంద్రా నిర్ణయం ఓ సెంటిమెంట్‌తో ముడిపడి ఉంది. ఆయనెప్పుడైతే మ్యాచ్‌ లైవ్‌ చూస్తారో అప్పుడు భారత జట్టు ఓటమి పాలవుతోందనేది ఆయనకు ఉన్న ఓ విశ్వాసం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. దీనిపై పలుసార్లు ఆయన ఫ్యాన్స్‌ స్పందిస్తూ కీలక మ్యాచ్‌లను మీరు చూడొద్దంటూ సరదాగా సలహా కూడా ఇచ్చారు.

మహీంద్రా తాజా ట్వీట్‌పై ఓ నెటిజన్‌ స్పందిస్తూ ఇది కూడా జట్టుకు మద్దతుగా నిలవడంలో భాగమే అని కామెంట్‌ చేశారు. మరో వ్యక్తి బదులిస్తూ.. ‘‘మీరు ఎప్పటికీ మా హీరోనే. చరిత్ర మీ త్యాగాన్ని గుర్తించకపోవచ్చు. కానీ, మీ సేవలకు మేం ప్రాచుర్యం కల్పిస్తాం’’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. మరో యూజర్‌ మాత్రం ఇవన్నీ అపోహలనీ.. మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేయాలని కోరాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని