BSNL 4జీ అప్‌డేట్‌.. త్వరలోనే అందుబాటులోకి సర్వీసులు: కేంద్రమంత్రి

BSNL 4G Services: బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలకు సంబంధించిన పనులు వాయువేగంతో జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి దేవ్‌సిన్హ్‌ చౌహాన్‌ వెల్లడించారు.

Published : 09 May 2023 23:10 IST

దిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) 4జీ సర్వీసులకు సంబంధించి పనులు త్వరితగతిన సాగుతున్నాయని కేంద్రమంత్రి దేవుసిన్హ్‌ చౌహాన్‌ వెల్లడించారు. త్వరలోనే ఈ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి (BSNL 4G Services) రానున్నాయని చెప్పారు. లక్ష బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సైట్లకు మంత్రివర్గ ఉప సంఘం ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు వాయువేగంతో జరుగుతున్నాయని, సర్వీసులను వీలైనంత తొందరగా ప్రారంభించాలని ప్రభుత్వం చూస్తోందని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ (BSNL 4G) పూర్తిగా దేశీయ టెక్నాలజీతో వస్తోందని మంత్రి తెలిపారు. ఇందుకు కొంత సమయం పట్టినప్పటికీ.. త్వరలోనే వినియోగదారులకు సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. మరోవైపు ప్రభుత్వ రంగ ఇ-కామర్స్‌ ఓఎన్‌డీసీకి (ONDC) లాజిస్టిక్‌ సహకారం కోసం పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌తో ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం చూస్తోందని చెప్పారు. పెస్కీ కాల్స్‌ సమస్య త్వరలోనే పరిష్కారం లభించబోతోందన్నారు. మరోవైపు దేశంలో 5జీ సేవల విస్తరణపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఏ దేశంలోనూ లేని విధంగా దేశంలో 5జీ సేవల విస్తరణ కొనసాగుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని