Israel-Hamas: హమాస్‌ సంబంధిత ఖాతాలను తొలగించాం: ‘ఎక్స్‌’ సీఈఓ

Israel-Hamas: ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడుల నేపథ్యంలో ఎలాంటి ప్రమాదకర సమాచారం వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వెల్లడించింది.

Published : 12 Oct 2023 17:39 IST

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌పై దాడుల నేపథ్యంలో హమాస్‌కు (Israel-Hamas) చెందిన వందలాది ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతాలను తొలగించినట్లు సంస్థ సీఈఓ లిండా యాకరినో (Linda Yaccarino) వెల్లడించారు. దాడులు ప్రారంభమైన తర్వాత వేలాది సందేశాలను తొలగించడం లేదా హానికరమైన సమాచారం అని తెలిసేలా సంకేతాలు ఉంచినట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌- హమాస్‌ (Israel-Hamas) యుద్ధం నేపథ్యంలో ప్రమాదకరమైన సమాచారాన్ని ఎలా నియంత్రిస్తున్నారంటూ ఐరోపా సమాఖ్యకు చెందిన ఓ ఉన్నతాధికారి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆమె ఈ విషయాలను వెల్లడించారు.

ఇజ్రాయెల్‌- హమాస్‌ (Israel-Hamas) ఘర్షణల నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఎక్స్‌లోని సమాచారాన్ని, సందేశాలను సమీక్షిస్తున్నామని యాకరినో (Linda Yaccarino) తెలిపారు. నకిలీ, తప్పుదోవ పట్టించే సందేశాల విషయంలో తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తమ వేదికపై ఉగ్రవాద సంస్థలకు, హింసాత్మక అతివాద గ్రూపులకు స్థానం లేదని స్పష్టం చేశారు. అలాంటివేమైనా ఉంటే వెంటనే గుర్తించి తొలగిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని