Electricity Bill: ఏడాదికి రూ.24,000 వరకు విద్యుత్తు బిల్లు ఆదా

దేశంలోనే తొలి పోర్టబుల్‌ సౌర ఫలకల వ్యవస్థను గాంధీనగర్‌లోని స్వామినారాయణ్‌ అక్షరధామ్‌ ఆలయ కాంప్లెక్స్‌లో ఆవిష్కరించారు. జర్మనీకి చెందిన డాయిష్‌ జెసెల్‌షాఫ్ట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌

Updated : 20 Apr 2022 08:54 IST

దేశంలోనే తొలి పోర్టబుల్‌ సోలార్‌ రూఫ్‌టాప్‌ ఆవిష్కరణ

దిల్లీ: దేశంలోనే తొలి పోర్టబుల్‌ సౌర ఫలకల వ్యవస్థను గాంధీనగర్‌లోని స్వామినారాయణ్‌ అక్షరధామ్‌ ఆలయ కాంప్లెక్స్‌లో ఆవిష్కరించారు. జర్మనీకి చెందిన డాయిష్‌ జెసెల్‌షాఫ్ట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ జుసామెనార్బిట్‌(జీఐజడ్‌) సహకారంతో 10 పీవీ పోర్ట్‌ వ్యవస్థలను ఇందులో నెలకొల్పినట్లు సంస్థ తెలిపింది. దేశంలోని నగరాల్లో పునరుత్పాదక ఇంధన అభివృద్ధి కోసం కేంద్ర కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. జీఐజడ్‌ డిజైన్‌ చేసిన ఈ పీవీ పోర్ట్‌ సిస్టమ్స్‌ను ప్రామాణిక ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో వినియోగించుకోవచ్చు. బ్యాటరీ స్టోరేజీ ఉండి/లేకుండా కనీసం 2 కేడబ్ల్యూపీ సామర్థ్యంతో వినియోగించుకోవచ్చు. కాగా, ఈ పీవీ పోర్ట్స్‌ను దిల్లీకి చెందిన సెర్వోటెక్‌ పవర్‌సిస్టమ్స్‌ తయారు చేసింది. ఈ కంపెనీ ‘భారత్‌లో తయారీ’ కింద హై ఎండ్‌ సోలార్‌ ఉత్పత్తులైన ఎల్‌ఈడీలు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, ఈవీ ఛార్జింగ్‌ సామగ్రి తదితరాలను తయారు చేస్తోంది. ‘పీవీ పోర్ట్‌ సిస్టమ్స్‌కు వ్యయం, నిర్వహణ భారం తక్కువ. భారత వాతావరణానికి తగినవి. కేవలం ఒక వ్యక్తి సులభంగా ఇన్‌స్టాల్‌ చేయొచ్చు. 25-30 ఏళ్ల వరకు వీటిని వినియోగించుకోవచ్చు. ప్యానెళ్ల కింద స్థలాన్ని సైతం వినియోగించుకునేలా తయారు చేసిన ఈ పీవీ పోర్ట్‌ సిస్టమ్‌ ద్వారా సగటున ఏటా రూ.24,000 వరకు విద్యుత్తు బిల్లులను ఆదా చేసుకోవచ్చ’ని ఆ ప్రకటన వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని