Zomato: రహస్యంగా వివాహం చేసుకున్న జొమాటో సీఈఓ..!

జొమాటో(Zomato) సీఈఓ దీపిందర్ గోయల్ ఒక మోడల్‌ను వివాహం చేసుకున్నారు. 

Updated : 22 Mar 2024 12:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఆహార డెలివరీ యాప్‌ జొమాటో(Zomato) సీఈఓ దీపిందర్ గోయల్‌ (Deepinder Goyal) రెండో పెళ్లి చేసుకున్నారు. మోడల్‌ గ్రేసియా మునోజ్‌ను వివాహం చేసుకున్నారని సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ మీడియా కథనాలు వెలువడ్డాయి. నెల క్రితమే ఈ పెళ్లి జరగ్గా.. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

మునోజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ బయో ప్రకారం.. ఆమె మెక్సికోలో జన్మించారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. గతంలో మోడలింగ్ చేసిన ఆమె.. ఇప్పుడు సొంతంగా స్టార్టప్‌ నడుపుతున్నారు. గోయల్‌కు ఇది రెండో పెళ్లి. అంతకుముందు కంచన్‌ జోషితో వివాహం జరిగింది. దీపిందర్.. 2008లో హరియాణాలోని గురుగ్రామ్‌ కేంద్రంగా జొమాటో సంస్థను స్థాపించారు. కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగాన్ని వదిలి.. ఆహార డెలివరీ యాప్‌ ప్రారంభించారు. దేశంలో వెయ్యికి పైగా నగరాల్లోకి దీని కార్యకలాపాలు విస్తరించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని