Zomato: జొమాటోకు రూ.184 కోట్ల పన్ను, పెనాల్టీ నోటీసు

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో రూ.184 కోట్ల ట్యాక్స్‌, పెనాల్టీ నోటీసు అందుకుంది. దీన్ని సవాల్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

Published : 02 Apr 2024 15:53 IST

Zomato | దిల్లీ: ప్రముఖ పుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటోకు (Zomato).. ఆదాయపు పన్ను శాఖ నుంచి ట్యాక్స్‌ డిమాండ్‌ నోటీసు అందింది. సర్వీస్‌ ట్యాక్స్‌, పెనాల్టీ కలిపి రూ.184 కోట్లు చెల్లించాలని ఆ శాఖ ఆదేశించింది. దీనిపై అప్పీల్‌కు వెళతామని జొమాటో పేర్కొంది. సోమవారం అర్ధరాత్రి సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.

విదేశీ అనుబంధ సంస్థలు, దేశం వెలుపల ఉన్న శాఖల్లో 2014 అక్టోబర్‌ నుంచి 2017 జూన్‌ మధ్య జరిగిన విక్రయాలపై సర్వీస్‌ ట్యాక్స్‌ చెల్లించలేదని దిల్లీ సెంట్రల్‌ ట్యాక్స్‌ కమిషనర్‌ ఏప్రిల్‌ 1న డిమాండ్‌ నోటీసు పంపించినట్లు కంపెనీ తెలిపింది. ఇదివరకే పంపించిన షోకాజ్‌ నోటీసుపై తాము ఆధారాలతో సహా వివరణ ఇచ్చామని, ఈ ఉత్తర్వులు ఇచ్చే ముందు సంబంధిత అధికారులు దీన్ని పరిగణనలోకి తీసుకోలేదని జొమాటో పేర్కొంది.

వడ్డీతో కలిపి సర్వీస్‌ ట్యాక్స్‌ కింద రూ.92,09,90,306 (రూ.92 కోట్లు), అంతే మొత్తంలో (రూ.92 కోట్లు) పెనాల్టీ కలిపి రూ.184 కోట్లకు డిమాండ్‌ నోటీసు అందుకున్నట్లు జొమాటో పేర్కొంది. దీనిపై సంబంధిత అథారిటీ ముందు అప్పీల్‌కు వెళతామని పేర్కొంది. దీనివల్ల కంపెనీ ఆర్థిక పరిస్థితిపై ఏ ప్రభావమూ ఉండబోదని భావిస్తున్నట్లు తెలిపింది. రెండ్రోజుల క్రితం కూడా ఇలానే కర్ణాటక అసిస్టెంట్‌ కమిషన్‌ కార్యాలయం నుంచి జొమాటోకు రూ.23 కోట్లకు పన్ను డిమాండ్‌ నోటీసు వచ్చింది. దీన్ని కూడా సవాల్ చేస్తామని ఆ కంపెనీ ఇదివరకే తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు