Zomato: ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్‌

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్‌ గోయల్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్‌ ఎలా ఉపయోగపడనుందంటే..

Published : 18 May 2024 00:08 IST

Zomato | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ కంపెనీ జొమాటో (zomato) కొత్తతరహా ఫీచర్‌ను తీసుకొచ్చింది. వినియోగదారులను ఆకర్షించడంలో భాగంగా ఇప్పటికే ‘ప్యూర్‌ వెజ్‌ మోడ్‌’ ( Pure Veg Mode) పేరుతో కొత్త సేవలకు శ్రీకారం చుట్టిన సంస్థ తాజాగా.. తన యూజర్లు ఆరోగ్యంపై శ్రద్ధ చూపేలా కొత్త తరహా ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడంలో ఈ ఫీచర్‌ సాయపడాలనే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చినట్లు జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ (Deepinder Goyal) ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు.

‘‘జొమాటో కొత్త ఫీచర్‌ని ప్రారంభించాం. ఇకపై మీరు ఫుడ్‌ను ఆర్డర్‌ చేసే ముందు ఈ ఫీచర్‌ మీకు సాయం చేస్తుంది. ఉదాహరణకు.. మీరు నాన్‌ను ఎంపిక చేసుకొనేందుకు ప్రయత్నిస్తే ఆ సమయంలో నాన్‌కు బదులు రోటీ ఎంచుకుంటారా? అంటూ ఓ ప్రత్నామ్యాయ ఎంపికను చూపిస్తాం. లేదా మీకు ఏదైనా తీపి పదార్థం తినాలనుకుంటే తక్కువ కేలరీలున్న స్వీట్‌ను ఎంపిక చేసేందుకు ఫీచర్‌ తోడుంటుంది’’ అని గోయల్‌ తెలిపారు. ఈ కొత్త ఫీచర్‌ ఇప్పటికే 7శాతం అటాచ్మెంట్‌ రేటును పొందిందన్నారు. వినియోగదారుల నుంచి అధికంగా సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. త్వరలోనే ఇతర వంటకాలకు దీన్ని విస్తరించాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. తాజాగా బ్లింకిట్‌ కూడా తన కస్టమర్లను పెంచుకోవడంలో భాగంగా ఎక్కువ మొత్తంలో కూరగాయలు కొన్నవారికి కొత్తిమీర ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు